Mohanlal | ‘మైయాల్జియా’తో బాధపడుతున్న మలయాళ నటుడు మోహన్‌లాల్.. తీవ్రమైన వ్యాధా..? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..?
Mohanlal | మలయళ నటుడు మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూ భారతీయ సినీ అభిమానులను అలరిస్తున్నారు. అయితే, ఆయన అస్వస్థతకు గురైన విషయం విధితమే. దాంతో అభిమానులంతా ఆయనకు ఏమైందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.

Mohanlal | మలయళ నటుడు మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూ భారతీయ సినీ అభిమానులను అలరిస్తున్నారు. అయితే, ఆయన అస్వస్థతకు గురైన విషయం విధితమే. దాంతో అభిమానులంతా ఆయనకు ఏమైందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆయన కొచ్చిలోని ఏఐఎంఎస్ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అయితే, వైరల్ రెస్పిరేటరి ఇన్‌ఫెక్షన్‌గా అనుమానం వ్యక్తం చేశారు వైద్యులు. ఈ సందర్భంగా ఓ కీలక విషయాన్ని సైతం వెల్లడించారు. మైయాల్జియాతో బాధపడుతున్నారని వైద్యలు చెప్పారు. దాంతో మైయాల్జియా అంటే ఏం..టీ? ఏమైనా తీవ్రమైన వ్యాధా..? ప్రాణాంతకమైందా? అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.
మైయాల్జియా గురించి నిపుణులు ఏమంటున్నారంటే..?
వైద్యశాస్త్రంలో ‘మైయాల్జియా’గా పిలిచే భారీగానే ఉంటుందని వైద్య సంస్థలు పేర్కొంటున్నాయి. కండరాలు, లిగ్మెంట్‌లలో నొప్పులు వస్తాయని పేర్కొంది. జాన్స్ జాన్స్ హప్కిన్స్ విశ్వవిద్యాలయం మైయాల్జియాకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం.. మైయాల్జియా వ్యాధి వచ్చేందుకు చాలానే కారణాలు ఉంటాయని పేర్కొంది. గాయాలు, ఒత్తిడికి గురవడం, మందులు ఎక్కువగా తీసుకోవడం, తరచూ ఆరోగ్య సమస్యల బారినపడడమే ప్రధాన కారమని పేర్కొంది. మైయాల్జియా కారణంగా శరీరంపై తీవ్రమైన ప్రభావమే చూపుతుందని నివేదికలో విశ్వవిద్యాలయం తెలిపింది
విశ్రాంతి ఎన్నిరోజులు అవసరం..
మైయాల్జియాతో బాధపడుతున్నందున మోహన్‌లాల్ చాలారోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యలు తెలిపారు. మసాజ్‌తో పాటు ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొద్దిరోజులు ఎక్కడకు వెళ్లకుండా ఉండాలి. అయితే, మానసిక ఆందోళన లేకుండా జాగ్రత్తపడాలి. మందుల కన్నా వ్యక్తిగత అలవాట్లతో మైయాల్జియా నివారించేందుకు ఛాన్స్ ఉంది. సరైన ఆహారం, ఫిజియోథెరపి, వేడి – చల్లటి నీటి థెరపీతో మైయాల్జియాను నివారించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స ఇస్తుండగా.. రెండు, మూడురోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. ఆ తర్వాత డిశ్చార్జి చేసే అవకాశాలున్నాయి. దాదాపు 15రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.
సినిమాలతో ఫుల్ బిజీ..
మోహన్‌లాలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. చివరిసారిగా ఆయన మలైకోట్టై వాలిబన్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న కన్నప్ప చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎల్ – 2 ఎంపురాన్, రామ్, వృషభతో పాటు బారోజ్ చిత్రాల్లో నటిస్తున్నారు. బారోస్ స్వీయ దర్శకత్వంలో హీరోగా బారోజ్ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఈ అక్టోబర్ 9న విడుదల కానున్నది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘తన రహస్యాలను మీ అందరితో పంచుకునేందుకు ‘బరోజ్’ వచ్చేస్తున్నాడు. అందరూ సిద్ధంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఆర్మీతో కలిసి ఆయన సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సీఎంఆర్‌ఎఫ్ భారీగా విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.