Allu Arjun| సైకిల్ పంచ‌ర్స్ వేసుకునే ముఖ‌పోడా.. నాగ‌బాబుని బ‌న్నీ అంతమాట అన్నాడా..!

Allu Arjun|  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నా కూడా స‌మ‌యం కుదుర్చుకొని త‌న స్నేహితుడికి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ఇటీవ‌ల నంద్యాల వెళ్లి ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. వైసీపీకి చెందిన రవిచంద్ర కిషోర్ రెడ్డి తన స్నేహితుడు కాబట్టి మద్దతిచ్చానని, తాను రా

  • By: sn    cinema    May 17, 2024 8:43 AM IST
Allu Arjun| సైకిల్ పంచ‌ర్స్ వేసుకునే ముఖ‌పోడా.. నాగ‌బాబుని బ‌న్నీ అంతమాట అన్నాడా..!

Allu Arjun|  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నా కూడా స‌మ‌యం కుదుర్చుకొని త‌న స్నేహితుడికి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ఇటీవ‌ల నంద్యాల వెళ్లి ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. వైసీపీకి చెందిన రవిచంద్ర కిషోర్ రెడ్డి తన స్నేహితుడు కాబట్టి మద్దతిచ్చానని, తాను రాజకీయాలకు దూరమని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదంటూ కూడా అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. అయితే సొంత ఫ్యామిలీకి చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం రాలేదు కాని అపోజీష‌న్ పార్టీకి చెందిన నేత‌కి ఎలా ప్ర‌చారం చేస్తావు అంటూ బ‌న్నీపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే నాగ‌బాబు వేసిన ట్వీట్ సంచ‌ల‌నం సృష్టించింది.


మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే అంటూ నాగబాబు ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని మీడియాలో, సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జ‌ర‌గ‌డంతో దీనిపై పెద్ద ఎత్తున డిస్క‌ష‌న్ న‌డిచింది. నాగబాబు ట్వీట్ వ‌ల‌న మెగా, అల్లు ఫ్యాన్స్‌ మధ్య ట్రోలింగ్స్‌, విమర్శల వర్షం కురిసింది. ఈ వివాదం చిరంజీవి దృష్టికి వెళ్ల‌డంతో ఆయ‌న కాస్త గ‌ట్టిగా మందలించిన‌ట్టు తెలుస్తుంది. దీంతో ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకోలేక ట్విట్ట‌ర్‌కి గుడ్ బై చెప్పిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ వివాదం త‌ర్వాత అల్లు అర్జున్ ట్విట్ట‌ర్‌లో ఓ ట్వీట్ ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతుంది.

అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనేవాడు బాపట్ల పోస్టాఫీస్ వద్ద సైకిల్ షాప్ లో పంక్చర్లు వేసుకునేవాడు అని ట్వీట్‌లో ఉంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మార‌గా, దీనిని బ‌న్నీ అభిమానులు ట్రెండింగ్ లోకి తెస్తున్నారు. ఈ ట్వీట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అల్లు అర్జున్ ఖాతాలో ఇటువంటి ట్వీట్ కనిపించడంతో మెగా అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చేశాడా? లేదంటే అతని ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందా? లేదంటే బన్నీ కౌంటర్ వేయాలని ఇలా చేశాడా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.