Anaganaga Oka Raju | ‘అనగనగా ఒక రాజు’ ప్రోమో విడుదల
‘అనగనగా ఒక రాజు’ ప్రోమో విడుదల. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో, సంక్రాంతి 2026కి 14 జనవరిలో రిలీజ్.

విధాత : నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’ నుంచి ప్రోమో విడుదలైంది. సంక్రాంతి ప్రోమో’ పేరుతో వచ్చిన ఈ ప్రోమోలో నవీన్, మీనాక్షిలు జ్యువెలరీ యాడ్‌ను అనుకరిస్తూ..అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటంచారు. ప్రోమోలో సన్నివేశాలు చూస్తే గౌరవపురం గోపరాజు మనుమడు రాజు పాత్రలో నవీన్ పొలిశెట్టి నవ్వించబోతున్నట్లుగా తెలుస్తుంది. కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానుంది.
నవీన్ పొలిశెట్టి గత సినిమాల తరహాలోనే మరోసారి కామెడీ జోనర్ సినిమాతోనే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఇదే సంక్రాంతికి రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి సినిమా మన శంకర్ వరప్రసాద్ తో పాటు రవితేజ డైరెక్టర్ కిషోర్ తిరుమలసినిమా(అనార్కలి)తో పాటు తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘జననాయగన్’ సినిమాతో అనగనగా ఒక రాజు పోటీ పడాల్సి ఉంటుంది. ఆ మూడు సినిమాలతో పాటు సంక్రాంతి బరిలో మరో రెండు సినిమాలు కూడా ఉండే అవకాశముంది.