Nayanatara | అజిత్‌తో నయనతార వన్స్‌మోర్‌..! ఇక బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే..!

Nayanatara | సినీ ఇండస్ట్రీలో కాంబినేషన్‌ అనే పదానికి విలువ ఎక్కువగానే ఉంటుంది. ఈ పదం గుర్తుకురాగానే తొలుత గుర్తుకు వచ్చేది హీరోయిన్లే. ఆ తర్వాత హీరో-దర్శకుడు, హీరో-నిర్మాత, దర్శకుడు-నిర్మాత, దర్శకుడు-హీరోయిన్‌ కాంబినేషన్స్‌ గుర్తుకు వస్తాయి.

Nayanatara | అజిత్‌తో నయనతార వన్స్‌మోర్‌..! ఇక బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే..!

Nayanatara | సినీ ఇండస్ట్రీలో కాంబినేషన్‌ అనే పదానికి విలువ ఎక్కువగానే ఉంటుంది. ఈ పదం గుర్తుకురాగానే తొలుత గుర్తుకు వచ్చేది హీరోయిన్లే. ఆ తర్వాత హీరో-దర్శకుడు, హీరో-నిర్మాత, దర్శకుడు-నిర్మాత, దర్శకుడు-హీరోయిన్‌ కాంబినేషన్స్‌ గుర్తుకు వస్తాయి. ఇందులో హీరో, హీరోయిన్‌ జోడి ఆకర్షణీయంగా ఉంటేనే సినిమాలకు సైతం ప్రేక్షకుల్లో క్రేజ్‌ పెరుగుతుంది. కేవలం అందం ఒక్కటే కాకుండా సినిమా విజయంపై సైతం ప్రభావం ఉంటుంది. ఇంతకు ముందు కలిసి నటించి బాక్సాపీస్‌ వద్ద హిట్‌ సాధించినా హీరో, హీరోయిన్లు అయితే హిట్‌జోడీగా పిలుస్తుంటారు. మార్కెట్‌పై సైతం పెద్ద ప్రభావమే ఉంటుంది. దాంతో దర్శక నిర్మాతలు సైతం హిట్‌జోడీగా పిలుచుకున్న వారితో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా..? సినిమా ఇండస్ట్రీలో హిట్‌జోడీగా పేరున్న అజిత్‌-నయనతార ఐదోసారి జతకట్టబోతున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాల్లో కలిసి నటించగా.. ఆయా చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఐదోసారి బిగ్‌స్క్రీన్‌పై రొమాన్స్‌ పండించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో వైరల్‌గా మారింది. అజిత్‌ రాబోయే ప్రాజెక్టులో హీరోయిన్‌గా నయనతారని తీసుకున్నారి తెలుస్తున్నది. ఇంతకు ముందు ఈ రోల్‌ కోసం త్రిషను తీసుకోవాలని అనుకున్నారట. కానీ, చివరకు ఈ అవకాశం నయనతారకు దగ్గింది. ఈ సినిమా చేసేందుకు నయనతార గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఈ మూవీ కోసం రెమ్యునరేషన్‌ కూడా తక్కువ చేసిందని తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే, ఇటీవల నయనతార రెమ్యూనరేషన్‌ విషయంలో పలు సినిమాలు వదులుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో అజిత్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాపై బజ్‌ నెలకొన్నది. ఐదోసారి అజిత్‌-నయన్‌ జోడీ హీట్‌ కొట్టడం ఖాయమని అభిమానులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. అధిక్‌ రవిచంద్రన్‌తో అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ మూవీ చేయనున్నాడు. ఈ మూవీ కోసం నయనతారను తీసుకున్నట్లు సమాచారం. ఈ మూవీలో అజిత్‌ త్రిపాత్రాభినయం చేయనున్నాయని టాక్‌. ఈ మూవీ కోసం ఇంతకు ముందు సిమ్రాన్‌, మీనా పేర్లు వినిపించాయి. హీరోయిన్‌ లీడ్‌ రోల్‌లో నయనతారను సంప్రదించగా ఒకే చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం మూవీ హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుందని టాక్‌. ఇటీవల గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ ఇటీవల ఆవిష్కరించారు. కలర్‌ఫుల్ పోస్టర్‌లో అజిత్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించారు. ఈ మూవీ ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్నట్లు సమాచారం.