Tollywood Movies|టాలీవుడ్‌లో నడుస్తున్న నయా ట్రెండ్.. జాతర ఉంటే సినిమా హిట్ అయినట్టే..!
Tollywood Movies| ఇప్పుడు టాలీవుడ్ సినిమా స్థాయి పెరిగింది. బాలీవుడ్ సినిమాలని మించిన రేంజ్‌లో మన తెలుగు దర్శకులు వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కి

Tollywood Movies| ఇప్పుడు టాలీవుడ్ సినిమా స్థాయి పెరిగింది. బాలీవుడ్ సినిమాలని మించిన రేంజ్‌లో మన తెలుగు దర్శకులు వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కిస్తూ అందరిని అబ్బురపరుస్తున్నారు. కథ విషయంలోనే కాకుండా టెక్నాలజీ విషయంలోను ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాని ఉన్నతమైన విలువలతో రూపొందిస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ కూడా ఇప్పుడు టాలీవుడ్‌పై దృష్టి పెడుతున్నాయంటే తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్‌కి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే టాలీవుడ్‌లో ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తున్నట్టుగా అర్ధమవుతుంది. సినిమాలో జాతరకి సంబంధించిన సీన్స్ పెడితే ఆ సినిమా పక్కా హిట్ అవుతుందని అనేలా పరిస్థితి మారింది.
ఇప్పటి దర్శకులు సినిమాలు మాస్ అప్పీల్ తెప్పించేందుకు , ఫైట్ సీక్వెన్స్ ఇంట్రీకి, స్పెషల్ సాంగ్‌కి ఇలా ఓ జాతరని ప్లాన్ చేస్తున్నారు. ఈ జాతర కొన్ని సార్లు కథలో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇటీవల వచ్చిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కమిటీ కుర్రోళ్లు సినిమాలో జాతర ఎపిసోడ్ చాలా హైలైట్ అయింది. సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జాతర ఎపిసోడ్ గురించి కూడా తప్పక గుర్తు చేసుకుంటున్నారు. ఇక త్వరలో రాబోతున్న పుష్ప2లో కూడా జాతర ఎపిసోడ్‌ని భారీగా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ దేవరలోనూ జాతర ఎపిసోడ్ హైలైట్ అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. తారక్, జాన్వీ జంటగా నటిస్తున్న దేవరపై అంచనాలు భారీగా ఉండగా, ఈ సినిమా పక్కా హిట్ అవుతుందనే అభిప్రాయానికి వచ్చారు ఫ్యాన్స్.
అయితే ఇప్పుడు రిలీజ్ కాబోతున్న సినిమాలే కాకుండా గతంలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలలోను జాతర మనకు కీరోల్‌గా కనిపిస్తుంది. వాల్తేరు వీరయ్య, క్రాక్, మంగళవారం, రంగస్థలం సినిమాల్లోనూ జాతర ఎపిసోడ్స్ కీ రోల్ పోషించాయి. యూనివర్శల్ అప్పీల్ ఉన్న మాస్ ఎపిసోడ్స్ లో నెంబర్ వన్ ప్లేస్ దక్కించుకుంటోంది జాతర ఎపిసోడ్. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు.