Payal ghosh| పెగ్గేసి నిద్ర మాత్ర‌లు మింగ‌నిదే నిద్రే రాదంటున్న ఎన్టీఆర్ హీరోయిన్

Payal ghosh|  బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఈ అమ్మ‌డు ఎప్పుడు వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. ఆమె

  • By: sn    cinema    Jul 17, 2024 10:30 AM IST
Payal ghosh| పెగ్గేసి నిద్ర మాత్ర‌లు మింగ‌నిదే నిద్రే రాదంటున్న ఎన్టీఆర్ హీరోయిన్

Payal ghosh|  బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఈ అమ్మ‌డు ఎప్పుడు వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. ఆమె కెరీర్ లో దాదాపు 20 సినిమాలు మాత్ర‌మే చేసింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించి తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఊస‌ర‌వెల్లి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ.. ఈ అమ్మడిని మాత్రం తెలుగు ప్రేక్షకులు ఆమెను గుర్తుపెట్టుకున్నారు. అయితే క్యాస్టింగ్ కౌచ్ దగ్గరనుంచి తన ప్రియుడు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మోసం చేసిన విషయం వరకు అన్ని కూడా మొహ‌మాటం లేకుండా మీడియా ముందు చెప్పేస్తుంటుంది.

గతంలో మహ్మద్ షమీని పెళ్లి చేసుకుంటానంటూ వన్డే ప్రపంచ కప్ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడు అంటూ కూడా ఈ బాలీవుడ్ భామ కామెంట్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఇర్ఫాన్ ప‌ఠాన్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ఇర్ఫాన్ నుంచి విడిపోయిన తర్వాత … అనారోగ్యం పాలయ్యాను అని తెలియ‌జేసింది. ఇర్ఫాన్ నుండి విడిపోయిన త‌ర్వాత మ‌ళ్లీ ఎవ‌రిని ప్రేమించ‌లేదు అని కూడా ఈ భామ తెలిపింది. ఇక కాస్త గ్యాప్ ఇచ్చిన పాయ‌ల్ తాజాగా త‌న ఇన్‌స్టాలో త‌న‌కు ఎదురైన విచిత్ర ప‌రిస్థితుల గురించి చెప్పుకొచ్చింది.

తాను నిదుర మాత్ర‌లు మింగ‌నిదే, ఒక గ్లాస్ వైన్ తాగ‌నిదే ఇప్ప‌టికీ నిదుర‌పోలేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.అనురాగ్ క‌శ్య‌ప్ త‌న‌పై అత్యాచారం చేయ‌డం వ‌ల‌న తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లోకి వెళ్లిన‌ట్టు చెప్పిన ఈ భామ కొన్నేళ్లుగా యాంటీ డిప్ర‌సెంట్ మందులు వాడుతున్నాట్టు తెలియ‌జేసింది. ఆ మందుల వ‌ల‌న ట్రామాలోకి వెళ్లాన‌ని కూడా వెల్ల‌డించింది. అంతేకాదు అనురాగ్ క‌శ్య‌ప్ కి కూతురు ఉంది. త‌ను కూడా నాలాగే అత్యాచారానికి గుర‌వుతుంద‌ని కూడా పాయ‌ల్ ఘోష్ వేరొక ఇన్ స్టా పోస్ట్ లో అనురాగ్ కి శాప‌నార్ధాలు పెట్టింది. ప్ర‌స్తుతం పాయ‌ల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.