లోక‌ల్‌-నాన్ లోక‌ల్ వివాదంపై స్పందించిన ప్రకాష్ రాజ్

విధాత:ఇప్పుడు లోకల్‌.. నాన్‌లోకల్‌ అని మాట్లాడుతున్నవారికి.. నేను తెలంగాణలో కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకొన్నప్పుడు నాన్‌లోకల్‌ అనిపించలేదా? నా అసిస్టెంట్లకు హైదరాబాద్‌లో ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్‌లోకల్‌ అనిపించలేదా? నాకు ఇక్కడ పొలం ఉంది. ఇల్లు ఉంది. నా కొడుకు ఇక్కడే స్కూలుకు వెళ్తాడు. నా ఆధార్‌ కార్డ్‌ అడ్రస్సు ఇక్కడే ఉంది. మ‌రి నేను నాక్ లోక‌ల్ ఎలా అవుతాను? అంతఃపురం సినిమాకు జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు నేను నాన్‌లోకల్‌ కాలేదే! నవనందులు తీసుకున్నప్పుడు నాన్‌లోకల్‌ కాలేదే! […]

లోక‌ల్‌-నాన్ లోక‌ల్ వివాదంపై స్పందించిన ప్రకాష్ రాజ్

విధాత:ఇప్పుడు లోకల్‌.. నాన్‌లోకల్‌ అని మాట్లాడుతున్నవారికి.. నేను తెలంగాణలో కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకొన్నప్పుడు నాన్‌లోకల్‌ అనిపించలేదా? నా అసిస్టెంట్లకు హైదరాబాద్‌లో ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్‌లోకల్‌ అనిపించలేదా? నాకు ఇక్కడ పొలం ఉంది. ఇల్లు ఉంది. నా కొడుకు ఇక్కడే స్కూలుకు వెళ్తాడు. నా ఆధార్‌ కార్డ్‌ అడ్రస్సు ఇక్కడే ఉంది. మ‌రి నేను నాక్ లోక‌ల్ ఎలా అవుతాను?

అంతఃపురం సినిమాకు జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు నేను నాన్‌లోకల్‌ కాలేదే! నవనందులు తీసుకున్నప్పుడు నాన్‌లోకల్‌ కాలేదే! అప్పుడు లేని విషయం ఇప్పుడు ఎలా వచ్చింది..? ఈ కామెంట్స్‌ చేసేవారి సంకుచిత మనస్తత్వం, వారి స్థాయి, వారి మానసిక పరిస్థితిని మనం గమనించాలి అని ప్ర‌కాశ్ రాజ్ అన్నారు.

మా అధ్య‌క్ష ప‌దవికి పోటీ చేయాలనేది ఇప్పుడు నిర్ణ‌యం కాదు. దీని వెన‌క చాలా మ‌థ‌నం దాగి ఉంది. ఇది కోపంతో వ‌చ్చింది కాదు, ఆవేద‌న‌తో పుట్టిన సినిమా బిడ్డ‌ల ప్యానెల్ ఇది. మూడు దశాబ్దాలుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నా. ఈ పరిశ్రమ నాకు పేరు, హోదా, గౌరవం అన్నీ ఇచ్చింది. ఇక్క‌డ జ‌రుగుతున్న‌వి చూస్తూ ఉండ‌లేక‌పోయాను. ఒక ఏడాది క్రితం నుంచి కళ్ల ఎదురుగా జరుగుతున్నది చూస్తూ కూర్చోవటం సరికాదనిపించింది. సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలనిపించింది. నాలా ఆలోచించేవారితో ఒక టీమ్‌ తయారుచేసుకున్నా అని ప్ర‌కాశ్ రాజ్ పేర్కొన్నారు.

మా కు ఒక ఇల్లు లేదు. సభ్యుల ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఒక ఆర్టిస్టు కొడుకు ‘మా’ అసోషియేషన్‌కు వస్తే- ‘మా నాన్న ఆర్టిస్టు’ అని గర్వంగా ఫీలవ్వాలి. అతని గుండె ఉప్పొంగాలి. ఆ నమ్మకం, కౌగిలింపు సభ్యులకు అసోషియేషన్‌ ఇవ్వగలగాలి. సభ్యులకు అసోషియేషన్‌ ఇచ్చేది దానం కాకూడదు. వారు కష్టపడి పనిచేసి సంపాదించుకొన్న ఆత్మగౌరవం కావాలి. అంద‌రిని క‌లిసి అజెండా చెబుతాను. ఏ ఒక్క‌రికి వ్య‌తిరేఖంగా మాట్లాడను మా మేనిఫెస్టో చూసిన తర్వాత సభ్యులు మాకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంది అని ప్ర‌కాశ్ రాజ్ స్ప‌ష్టం చేశారు.

ReadMore:నాన్ లోకల్ అని అప్పుడు గుర్తుకురాలేదా ..? ప్రకాష్ రాజ్