మోహన్ బాబు ఇంటికి రజనీకాంత్..!
సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్నేహితుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు సరదాగా గడిపారు. గత కొద్ది రోజులుగా అన్నాత్తె సినిమా కోసం రజనీకాంత్ హైదరాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లో అనారోగ్యానికి గురి కావడం వలన షూటింగ్ వాయిదా పడగా, ఇప్పుడు అది పూర్తి చేశారు. దాదాపు 35 రోజుల పాటు నాన్ స్టాప్ షెడ్యూల్ తో తన పార్ట్ చిత్రీకరణను కంప్లీట్ చేశారు. షూటింగ్ పూర్తయ్యాక రజనీకాంత్ తన […]

సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్నేహితుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు సరదాగా గడిపారు. గత కొద్ది రోజులుగా అన్నాత్తె సినిమా కోసం రజనీకాంత్ హైదరాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లో అనారోగ్యానికి గురి కావడం వలన షూటింగ్ వాయిదా పడగా, ఇప్పుడు అది పూర్తి చేశారు. దాదాపు 35 రోజుల పాటు నాన్ స్టాప్ షెడ్యూల్ తో తన పార్ట్ చిత్రీకరణను కంప్లీట్ చేశారు.
షూటింగ్ పూర్తయ్యాక రజనీకాంత్ తన స్నేహితుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లి కొద్ది సేపు గడిపారు. ఈ సమయంలో రజనీకాంత్‌తో సెల్ఫీ దిగింది మంచు లక్ష్మీ. వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.