Ram Charan| ఈ సెల‌బ్రిటీలు విడిపోతారని రామ్ చ‌ర‌ణ్ అప్పుడే చెప్పేశాడు..!

Ram Charan| చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ సినిమా ఆయ‌న‌కి గ్లోబ‌ల్ స్టార్ డ‌మ్ తెచ్చిపెట్టింది. అయితే కెరీర్ తొలినాళ్ల‌లో రామ్ చ‌ర‌ణ్ ప‌లు స‌వాళ్లని ఎదుర్కొన్నా

  • By: sn    cinema    Jul 20, 2024 10:42 AM IST
Ram Charan| ఈ సెల‌బ్రిటీలు విడిపోతారని రామ్ చ‌ర‌ణ్ అప్పుడే చెప్పేశాడు..!

Ram Charan| చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ సినిమా ఆయ‌న‌కి గ్లోబ‌ల్ స్టార్ డ‌మ్ తెచ్చిపెట్టింది. అయితే కెరీర్ తొలినాళ్ల‌లో రామ్ చ‌ర‌ణ్ ప‌లు స‌వాళ్లని ఎదుర్కొన్నాడు. చిరుత చిత్రంతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన చ‌ర‌ణ్ ఆ త‌ర్వాత చేసిన ఆరెంజ్ చిత్రంతో పెద్ద డిజాస్ట‌ర్ అందుకున్నాడు. చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్‌గా మిగిలింది.. మోడ్రన్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ కథ అప్పుడు అంత‌గా ఆకట్టుకోలేక‌పోయింది కాని త‌ర్వాత మాత్రం ప్రేక్షకులు ఆదరించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మ్యూజికల్ హిట్ మూవీని క్లాసిక్ మూవీగా ట్రీట్ చేస్తుంటారు.

ఈ సినిమాని ఎప్పుడు చూసిన ఫ్రెష్ ఫీలింగ్ క‌లుగుతుంద‌ని చెబుతుంటారు. కాగా, మీమ‌ర్స్ ఇప్పుడు ఈ మూవీ స్టిల్స్ యూజ్ చేస్తూ ఆ పోస్ట్‌లని వైర‌ల్ చేస్తున్నారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్‌..లవ్ కొంత కాల‌మే బాగుంటుంద‌ని చెబుతాడు. ఇప్పుడు ఆ పోస్ట‌ర్‌తో ఇటీవ‌లి కాలంలో ప్రేమించి వివాహం చేసుకొని ఆ త‌ర్వాత విడాకులు తీసుకున్న వారి ఫోటోల‌ని జ‌త చేసి నెట్టింట తెగ వైర‌ల్ చేస్తున్నారు. చ‌ర‌ణ్ అప్పుడే ల‌వ్ గురించి చెప్పాడ‌ని, అందుకే సెల‌బ్రిటీల విడాకులు ఇప్పుడు ఇలా జ‌రుగుతున్నాయ‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

ఇటీవ‌లి కాలంలో స‌మంత‌- నాగ చైత‌న్య‌, ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య‌, నిహారిక‌- చైత‌న్య‌, హార్ధిక్ పాండ్యా- న‌టాషా వంటి వారు విడాకులు తీసుకొని త‌మ అభిమానుల‌కి పెద్ద షాక్ ఇవ్వ‌డం మ‌నం చూశాం. వీరంద‌రు త‌మ విడాకుల విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌గా, అది అభిమానుల‌ని చాలా మ‌నోవేద‌న‌కి గురి చేసింది. ఇక ఆరెంజ్ సినిమా విష‌యానికి వ‌స్తే.. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వం వ‌హించ‌గా, ఈ చిత్రంలోని ప్రతిసాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఆరెంజ్ సినిమాను మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. 2010లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ కాగా.. ఇటీవల రీరిలీజ్ అయి మంచి వసూళ్లు రాబట్టింది