రామారావు గా రవితేజ

విధాత:మాస్‌ మహారాజా రవితేజ 68వ చిత్రానికి 'రామారావు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'ఆన్‌ డ్యూటీ' ట్యాగ్‌లైన్‌. టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ను సోమవారం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇందులో రవితేజ మండల రెవెన్యూ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందుకోసం ఓ విలేజ్‌ సెట్‌ను వేసి అందులో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్‌ హీరోయిన్‌. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రియల్‌ ఇన్‌సిడెన్స్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న […]

రామారావు గా రవితేజ

విధాత:మాస్‌ మహారాజా రవితేజ 68వ చిత్రానికి ‘రామారావు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఆన్‌ డ్యూటీ’ ట్యాగ్‌లైన్‌. టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ను సోమవారం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇందులో రవితేజ మండల రెవెన్యూ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందుకోసం ఓ విలేజ్‌ సెట్‌ను వేసి అందులో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్‌ హీరోయిన్‌.

శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రియల్‌ ఇన్‌సిడెన్స్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సత్యన్‌సూర్యన్‌ ఛాయగ్రాహకుడు. శామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్తూరుజిల్లా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రూపొందుతుంది. ఈ ఏడాది ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేసిన రవితేజ ఇప్పుడు ‘రామారావు’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.