ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మోడల్‌గా, హీరోయిన్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా.. సినిమా ఇండస్ట్రీలో మల్టీపుల్‌ ట్యాలెంటెండ్‌ వుమన్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. బ‌ద్రి సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన స‌మ‌యంలో ప‌వ‌న్‌తో మంచి సాన్నిహిత్యం ఏర్ప‌డింది. ఇక ఈఇద్ద‌రు క‌లిసి జానీ సినిమాలో న‌టించ‌గా, ఆ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డింది. ఇక అప్ప‌టి నుండి ఈ ఇద్దరు కొన్నాళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. అనంత‌రం వివాహం చేసుకున్నారు. వారి దాంప‌త్యంలో అఖీరా, ఆద్య ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో పవన్‌, రేణూ దేశాయ్‌ విడిపోగా, పిల్ల‌ల కోసం మాత్రం అప్పుడ‌ప్పుడు క‌లుస్తుంటారు. ఇక పిల్ల‌ల కోసం సినిమాల‌కి దూరంగా ఉన్న రేణూ దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై దర్శనమిచ్చారు.

రవితేజ నటించిన టైగర్‌ నాగేశ్వర రావు సినిమాలో హేమలతా లవణం పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక నుండి తాను మంచి పాత్ర‌లు పోషిస్తానంటూ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసింది. అయితే రేణూ దేశాయ్‌కి సామాజిక సేవ ఎక్కువ‌నే. ముఖ్యంగా మూగ జీవాలు అంటే ప్రాణం. ఇంట్లో పెట్స్‌తో పాటు పిల్లులను కూడా పెంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా పెట్స్ కోసం రేణూ దేశాయ్ అందరినీ వేడుకుంది. ఓ మూడు కుక్కలకు ఆపరేషన్ చేయించేందుకు 55 వేలు ఖర్చు అవుతుందని, అందులో ముప్పై వేలు తాను ఇస్తానని రేణూ దేశాయ్ పేర్కొంది. తాను ముప్పై వేలు బదిలీ చేశానని, మిగిలిన వాటిని అందరూ కలిసి అడ్జెస్ట్ చేయ‌మ‌న్న‌ట్టుగా విన్న‌వించుకుంది.

అందరూ కనీసం వంద రూపాయల చొప్పున ఇవ్వండంటూ రేణూ దేశాయ్ వేడుకుంది. పెంపుడు జంతువులను సంరక్షించే ఓ సంస్థ కోసం రేణూ దేశాయ్ ముందుకు రావడం ప‌ట్ల ఆమెపై నెటిజ‌న్స్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలో రేణూ దేశాయ్...ఇక అకిరా డెబ్యూ గురించి హింట్ ఇచ్చింది. ఇప్పటికైతే అకిరాకు నటించే ఆసక్తి అయితే లేదని, ఆ టైం వస్తే తానే ముందుగా ప్రకటిస్తానని పేర్కొంది. ఇక వ‌రుణ్‌, లావ‌ణ్య త్రిపాఠి పెళ్లికి త‌న‌కు ఆహ్వానం అందింద‌ని కాక‌పోతే నేను వెళ్ల‌ను అని రేణూ స్ప‌ష్టం చేసింది.

sn

sn

Next Story