Samantha | అరగుండుతో సమంత.. మండి పడుతున్న ఫ్యాన్స్
Samantha | అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోలతో పని చేసి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. నాగ చైతన్యని పెళ్లి చేసుకున్నా కూడా సమంత సినిమాలు చేసింది. అతని నుండి విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంతకి వరుస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లోను సమంత అదరగొడుతుంది. […]

Samantha |
అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోలతో పని చేసి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. నాగ చైతన్యని పెళ్లి చేసుకున్నా కూడా సమంత సినిమాలు చేసింది. అతని నుండి విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంతకి వరుస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.
ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లోను సమంత అదరగొడుతుంది. సమంత నటించిన తాజా చిత్రం ఖుషీ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్ లో తెగ బిజీగా ఉంది. వెరైటీ కాస్ట్యూమ్స్ లో మెరుస్తూ నానా రచ్చ చేస్తుంది. అయితే తాజాగా సమంత అరగుండు ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
కొందరు ఆకతాయిలు సమంత అరగుండు పిక్ ని సోషల్ వీడియోలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంతని దారుణంగా ట్రోల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే సమంత అరగుండు ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
దీనిపై సమంత అభిమానులు స్పందిస్తూ.. పాపం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చిన కూడా ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఆమెని ఎందుకిలా వేధిస్తున్నారు అంటూ మండి పడుతున్నారు. ప్రస్తుతం సామ్ అరగుండు పిక్ అయితే నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
సమంత కొద్ది రోజులుగా మయోసైటిస్ తో బాధపడుతుండగా, ఈ వ్యాధికి సరైన చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్లనుంది. ఖుషి విడుదల తర్వాత సమంత విదేశాలకి వెళ్లనుండగా, అక్కడే కొంత కాలం పాటు ఉండనున్నట్టు సమాచారం.
ఇక మయోసైటీస్ చికిత్స ఖర్చుకి పాతిక కోట్లు అవసరం అవుతుందని, ఈక్రమంలో ఆమె ఓ హీరో దగ్గర కొంత అప్పు చేసినట్టుగా కొందరు తప్పుడు వార్తలు పుట్టించారు. దీనిపై సమంత స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అదంతా ఫేక్ అని.. నా చికిత్సకు అంత ఖర్చు కాదని.. నేను సినిమాల్లో నటించి బాగానే సంపాదించాను. నాకు ఎవరి అవసరం లేదు.. అంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చింది.