Pushpa 2 | పుష్ప2 ది రూల్ నుంచి రెండో పాట విడుదల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ మూవీ పుష్ప ది రూల్ సినిమా నుంచి బుధవారం రెండో పాట విడుదల చేశారు. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే కపుల్ సాంగ్‌ను లాంఛ్ చేశారు.

ప్రమోషన్‌లో దూసుకెలుతున్న పుష్ప టీమ్
విధాత : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ మూవీ పుష్ప ది రూల్ సినిమా నుంచి బుధవారం రెండో పాట విడుదల చేశారు. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే కపుల్ సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న పుష్ప ది రూల్ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ముందుగా ప్రకటించినట్లుగానే రెండో పాట విడుదల చేశారు. ఈ పాటను చంద్రబోస్ రాశారు. ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య, విజయ్ పోలాకి, శ్రేష్టి వర్మ నృత్యం సమకూర్చారు. పాపులర్ సింగర్ శ్రేయాఘోషల్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషలన్నింటిలోఈ పాట పాడటం విశేషం.
మరి నెటిజెన్స్ నుంచి సూసేకి సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా, గ్లోబల్ మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న ఆసక్తికర సినిమాల్లో ఒకటి పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప ప్రాంఛైజీలో వస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా సందడి చేయనుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. అయితే సుసేకి అగ్గిరవ్వ సాంగ్ పుష్పలోని సామిసామి సాంగ్ స్థాయిలో లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.