Srikanth| ఏంటి… హీరో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో దొరికాడా..!

Srikanth| బెంగ‌ళూరు రేవ్ పార్టీ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. హైద‌రాబాద్‌కి చెందిన ఓ వ్య‌క్తి రేవ్ పార్టీ ఏర్పాటు చేయ‌గా, ఆ పార్టీలో ప‌లువురు తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు హాజరైన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. న‌టి హేమ కూడా ఆ రేవ్ పార్టీలో పాల్గొన్న‌ట్టు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు తెలియ‌జేశా

  • By: sn    cinema    May 20, 2024 4:27 PM IST
Srikanth| ఏంటి… హీరో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో దొరికాడా..!

Srikanth| బెంగ‌ళూరు రేవ్ పార్టీ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. హైద‌రాబాద్‌కి చెందిన ఓ వ్య‌క్తి రేవ్ పార్టీ ఏర్పాటు చేయ‌గా, ఆ పార్టీలో ప‌లువురు తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు హాజరైన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. న‌టి హేమ కూడా ఆ రేవ్ పార్టీలో పాల్గొన్న‌ట్టు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు తెలియ‌జేశాయి. ఇక హీరో శ్రీకాంత్ కూడా ఆ పార్టీలో దొరికాడ‌నే టాక్ వినిపించింది. ఈ క్ర‌మంలో శ్రీకాంత్ ఓ వీడియో బైట్ విడుద‌ల చేశారు. ”నేను హైద‌రాబాద్‌లోని మా ఇంట్లో ఉన్నా. బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లిన‌ట్లు, అక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ చేసిన‌ట్లు ఫోనులు వ‌చ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్స్ చూశా.

కొందరు మీడియా మిత్రులు ఫోన్ చేసి వార్త రాయలేదు. కొందరు ఆ వీడియో ప్రసారం చేశారు. అది చూసి నేను, మా ఫ్యామిలీ న‌వ్వుకున్నాం. ఇటీవల నాకు, నా భార్య‌కు విడాకులు ఇప్పించారు. ఇప్పుడు ఆ రేవ్ పార్టీకి వెళ్లానన్నారు. ఆ రేవ్ పార్టీలో దొరికిన‌ వ్యక్తి ఎవరో కొంచెం నాలా ఉన్నాడు. అత‌డికి కొంచెం గ‌డ్డం ఉంది. కానీ, ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. అతడిని చూసి నేనే షాక‌య్యా” అని శ్రీకాంత్ చెప్పారు. తాను రేవ్ పార్టీకి వెళ్లానని వస్తున్న వార్తలను దయచేసి ఎవ‌రూ న‌మ్మొద్దంటూ శ్రీకాంత్ తెలిపారు. తాను రేవ్ పార్టీల‌కు, పబ్బులకు వెళ్లే వ్య‌క్తిని కాదని, ఒకవేళ ఎప్పుడైనా బ‌ర్త్ డే పార్టీల‌కు వెళ్లినా కాసేపు ఉండి వచ్చేస్తాన‌ని తెలియ‌జేశారు.

ఇక హేమ కూడా రేవ్ పార్టీలో దొరికింద‌ని సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ప్రచారం నడుస్తుంది. కర్ణాటక మీడియా, సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదు అని హేమ వీడియో ద్వారా తెలియ‌జేశారు. అయితే బెంగళూరు పోలీసులు ఆవిడ ఫోటోను విడుదల చేశారు. ఫామ్ హౌసులో ఆవిడ ఆ వీడియో షూట్ చేశారని తెలియ‌జేశారు. పోలీసులకు దొరికి తర్వాత వీడియో విడుదల చేసిన హేమ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

Also Read :

Bengaluru Rave Party | “రేవ్​ పార్టీలో ఉన్నది తెలుగు నటి హేమనే”

Karate Kalyani | టాలీవుడ్ పరువు తీసిన హేమ: కరాటే కల్యాణీ

Bangalore Rave Party | బెంగుళూర్ రేవ్ పార్టీ కేసు ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ

Hema| బెంగ‌ళూరు రేవ్ పార్టీలో హేమ‌.. ఫోటో విడుద‌ల చేసిన బెంగ‌ళూరు పోలీసులు