Suriya|సూర్య,జ్యోతికల మధ్య దూరం పెరిగిందా.. సూర్య చెన్నైలో జ్యోతిక ముంబైలో.. కారణం?
Suriya|కోలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ కపుల్స్‌లో సూర్య, జ్యోతిక జంట ఒకటి. వీరిద్దరు ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు. అయితే సూర్య గతేడాది తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అప్పడు చాలా రూమర్లు వచ్చాయి. సూర్య, జ్యోతిక మధ్య విభేదాలు వచ్చాయని, అం

Suriya|కోలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ కపుల్స్‌లో సూర్య, జ్యోతిక జంట ఒకటి. వీరిద్దరు ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు. అయితే సూర్య గతేడాది తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అప్పడు చాలా రూమర్లు వచ్చాయి. సూర్య, జ్యోతిక మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ముంబైకు మారారంటూ ప్రచారం జరిగింది. వారిద్దరూ విడాకులు తీసుకోనున్నారని, అందుకే పుట్టింటికి జ్యోతిక వెళ్లారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఇప్పుడు కంగువా ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య(Suriya) వాటన్నింటికి చెక్ పెట్టారు. జ్యోతికతో తన అనుబంధం ఎంత గొప్పదో, ఆమె గురించి తాను ఎంత బాగా ఆలోచిస్తానో వివరించారు. సూర్య కామెంట్స్‌పై ప్రతి ఒక్కరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
జ్యోతిక తన 18-19వ ఏటనే ముంబై నుంచి చెన్నైకి షిప్ట్ అయ్యారు. దాదాపు 27 సంవత్సరాలు ఆమె చెన్నైలో ఉన్నారు. 18 ఏళ్లు ముంబైలో, 27 ఏళ్లు చెన్నైలో జ్యోతిక ఉన్నారు. చెన్నైలో నాతో, నా ఫ్యామిలీతో, పిల్లలతో ఉండి తన కెరీర్ ను కొనసాగింది. మా కోసం స్నేహితులను బంధువులందరినీ వదిలేసి ముంబై లైఫ్ స్టైల్ వదిలేసి ఉంది. 27 ఏళ్ల తర్వాత తిరిగి ఆమె తన తల్లిదండ్రులతో సమయం గడిపే అవకాశం వచ్చింది, ఆమె తన స్నేహితులతో సమయం గడిపే అవకాశం వచ్చింది. పురుషుడు ఎలా అయితే తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఉండాలి అనుకుంటారో మహిళలు అలాగే ఉండాలి అనుకుంటారు. ఆ విషయం నాకు ఆలస్యంగా అర్థం అయింది. కనుక ఆమె ముంబై(Mumbai)కి వెళ్లేందుకు ఒప్పుకున్నాను’ అన్నారు.
చెన్నై, ముంబై లను బ్యాలన్స్ చేస్తూ కాస్త బిజీగానే ఉంటున్నాను అని సూర్య అన్నారు.. నెలలో కనీసం పది రోజులు ముంబైలో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటానని , 20 రోజుల్లో ఎక్కువ గంటలు షూటింగ్ లో పాల్గొంటానని, ఆ పది రోజులు మాత్రం పూర్తిగా ముంబైలో పిల్లలతో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తానని సూర్య పేర్కొన్నారు. ఒకసారి పెళ్లైతే(Marriage) ఇక మహిళల వ్యక్తిగతం అనేది ఏమి ఉండదు. అంతా భర్త చెప్పినట్టే చేయాలి.. ఆయనతోనే అన్నీ అని చెబుతుంటారు. ఐతే ఫ్యామిలీ కోసం అన్ని సాక్రిఫైజ్ చేసిన భార్యకు అవసరమైన టైం లో అవసరమైన స్వేచ్చ ఇవ్వాలి. అది భార్యాభర్తల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ని బట్టి ఉంటుంది అని సూర్య చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విని ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.