సితార హెరాస్​మెంట్స్​ నాగవంశీ… తనో రామానాయుడు 2.0 మరి..!

రూ. 1500లకు మేమిచ్చే వినోదం కంటే ఏదొస్తుంది? షాపింగ్​కు వెళ్తే రూ.1500లకు ఏం కొంటారు? నచ్చిన హీరో సినిమాకెళ్తే హీరోను చూడాలి గానీ, కథ, స్క్రీన్​ప్లే మీకెందుకు? ఇవి సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamsi) అనబడే ఓ సినిమా నిర్మాత(Producer) అహంకారపు మాటలు.

సితార హెరాస్​మెంట్స్​ నాగవంశీ… తనో రామానాయుడు 2.0 మరి..!

రూ. 1500లకు మేమిచ్చే వినోదం కంటే ఏదొస్తుంది?
షాపింగ్​కు వెళ్తే రూ.1500లకు ఏం కొంటారు?
నచ్చిన హీరో సినిమాకెళ్తే హీరోను చూడాలి గానీ, కథ, స్క్రీన్​ప్లే మీకెందుకు?

ఇవి సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamsi) అనబడే ఓ సినిమా నిర్మాత(Producer) అహంకారపు మాటలు. బ్యానర్​, సితార ఎంటర్​టెయిన్​మెంట్స్(Sitara Entertainments)​. తీసింది 17 సినిమాలు(17 movies). అందులో ఒక్కటి తప్ప అన్నీ చెత్త సినిమాలే. ఆయనకు డబ్బులొచ్చాయి కాబట్టి, అవన్నీ గొప్ప సినిమాలంటాడు. అంతెందుకు? గుంటూరుకారం(Gunturu Karam) అనే ఒక ఫ్లాప్​ సినిమాను మరో ‘శంకరాభరణం’గా అనుకుంటాడు. ఇక భాష విషయానికొస్తే, డబ్బు భాష తప్ప మరో భాష రాదు. తెలుగులో మాట్లాడితే నోటినిండా కొలెస్టరాలే. ప్రేక్షకులంటే చిన్నచూపు, ఏవగింపు కూడా.

అసలు పదిహేనువందలు పెట్టి ఎందుకు సినిమా చూడాలి? వినోదం కోసం. ఆ గ్యారెంటీ ఏ నిర్మాతైనా ఇవ్వగలడా? లేడు. వాళ్లకు నచ్చిన కథతో, వాళ్లకు నచ్చిన హీరోకు వందల కోట్ల పారితోషికం ఇచ్చి, వాళ్లకు నచ్చినట్లు తీస్తే, ప్రేక్షకులకెందుకు నచ్చాలి? దానికి రూ.1500 ఎందుకు ఖర్చు పెట్టాలి?

అమీర్​పేట్​కు వెళ్లి 1500/‌‌– పెట్టి డ్రాయరో, బనీనో కొనుక్కున్నామంటే మనకు నచ్చింది కాబట్టి. షాపోడికి నచ్చింది కాదు. రోడ్డు మీద బండి వద్ద ఇడ్లీ తింటే 20 రూపాయలవుతుంది, అదే పెద్ద హోటళ్లో తింటే 200 అవుతుంది. ఎవరికిది ఏదిష్టమైతే అక్కడికే వెళ్తారని ఎస్వీఎన్​ అనే ‘బేబీ’ నిర్మాత అన్నాడు. 200 రూపాయలు పెట్టగలిగేవాళ్లు నాణ్యత, పరిశుభ్రత, పరిసరాలు చాలా బాగా ఉంటాయి కాబట్టి పెద్ద హోటల్​కు వెళ్తారు. మీరు 20రూపాయలకు అదే సినిమా, 200కు అదే సినిమా చూసిస్తున్నారు కదా. క్వాలిటీ(వినోదం)లో మార్పెక్కడిది? వీళ్లనుకునే వినోదంతో చూసినోడికి వాంతులొస్తే ఏది బెటర్​? అసలు ఇంటిల్లిపాది కూర్చుని చూసే సినిమా ఏదైనా తీస్తున్నారా..? తెరనిండా రక్తం, ముద్దులు, పొర్లాటలు తప్ప మనసుకు హాయినిచ్చేది ఒక్కటైనా ఉంటోందా? ఇదా వీళ్లు నిర్వచించే వినోదం? దీనికా ఎగేసుకుని 250 రూపాయలు పెట్టి చూడాలి? ఇట్లాంటి బలుపు మాటలు(Arrogant words) మాట్లాడే నిర్మాతల వల్లే ఇవాళ థియేటర్లకొచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అసలు వందల కోట్ల రెమ్యునరేషన్​ హీరోలకెందుకివ్వాలి? టికెట్​ రేట్​ ఎందుకు పెంచాలి? వీళ్లేమైనా దీనజనోద్ధరణ చేస్తున్నారా? వాడెవడికో వంద కోట్లు వీళ్లిస్తే, వీళ్లకు 250 ప్రేక్షకులెందుకివ్వాలి? ఓ నెల రోజులాగితే ఎలాగూ ఓటీటీలోకొస్తుంది. అయిపాయె.

దిల్​ రాజు(Dil Raju), దగ్గుబాటి సురేశ్​బాబు(Daggubati Suresh Babu) లాంటి వారు ప్రేక్షకులను థియేటర్​కు దూరం చేసి తప్పు మేమే చేసామంటుంటే, నాగవంశీ లాంటి వాడి మాటలు ఇంకా నాశనం చేసేలా ఉంటున్నాయి.

అసలు సినిమా అంటేనే కథరా బాబూ… ఆ కథ ఎంత బాగా చెప్పావన్నదే పాయింట్​. సినిమా బాగుంది అని జనాలు అంటేనే అది హిట్​. డబ్బులొస్తే కాదు. ఒకప్పుడు 50 రోజులు, వంద రోజులు, 200, సంవత్సరం ఇలా ఆడేవి సినిమాలు. ఇప్పుడు..? 500 కోట్లు, 1000 కోట్లు వసూలు చేస్తే సూపర్​ హిట్​ సినిమా. అంటే డబ్బులే కొలమానం. 1500 పెట్టి ప్రతీవాడు చూస్తే 1000కోట్లేం ఖర్మ? పదివేల కోట్లు కూడా వస్తాయి. కథ, కథనం బాగాలేకపోతే, ఎంత పెద్ద హీరో అయినా, నేలకేసి కొడతారు. దానికి ఉదాహరణలు ఆచార్య, ఆగడు, బ్రహ్మోత్సవం, సాహో, రాధేశ్యాం…ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల జీవితాలను రోడ్డు మీదకి లాగేసాయి. నిర్మాతలుగా మీరు, హీరోలుగా వాళ్లు బాగానే ఉంటారు. ఎటుచూసీ, మునిగేది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రేక్షకులు.

50 రోజులాడిన సినిమా ఈ మధ్య కాలంలో బహుశా ‘హనుమాన్’​ ఒక్కటే కావచ్చు. దానికి ముందు ‘బిచ్చగాడు’ అనే డబ్బింగ్​ సినిమా. ఇంకా మా సినిమాలో తప్పులు దొరకబడితే పది లక్షలిస్తామని వెధవ బిల్డప్ ఒకటి.

కానివ్వండి… ఇలా అయితేనన్నా తెలుగు ప్రేక్షకులు బుద్ధి తెచ్చుకుని థియేటర్​ వైపు చూడకుంటాఉంటారు.