Taraka ratna| తారకరత్న మరణించిన కూడా కోడలిని దగ్గరకు తీయని నందమూరి కుటుంబం..ఇంకెన్నాళ్లు కష్టాలు..!
Taraka ratna| నందమూరి ఫ్యామిలీ హీరో తారకరత్న ఊహించని విధంగా చిన్న వయస్సులో కన్నుమూసారు. 2023 జనవరిలో నారా లోకేష్ యువగళం పేరుతో మొదలైన పాదయాత్రలో గుండెపోటుతో కన్నుమూసారు. ఆయన కుప్పకూలిపోవడంతో వెంటనే తారకరత్నని బెంగుళూరులోని ప్రైవేట్

Taraka ratna| నందమూరి ఫ్యామిలీ హీరో తారకరత్న ఊహించని విధంగా చిన్న వయస్సులో కన్నుమూసారు. 2023 జనవరిలో నారా లోకేష్ యువగళం పేరుతో మొదలైన పాదయాత్రలో గుండెపోటుతో కన్నుమూసారు. ఆయన కుప్పకూలిపోవడంతో వెంటనే తారకరత్నని బెంగుళూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇరవై రోజులకు పైగా మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న కన్నుమూశారు తారకరత్న.ఆయన మరణవార్త విని టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. అయితే తారకరత్నకి 2012లో తారకరత్న అలేఖ్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమ వివాహం జరిగింది. పెద్దలని వ్యతిరేఖించి అత్యంత మిత్రుల సమక్షంలో వారు వివాహం చేసుకున్నారు.
అలేఖ్య.. తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు చిత్రానికి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అలేఖ్యకి అంతకముందే పెళ్లి కావడం, కులాలు వేరు కావడం వలన నందమూరి కుటుంబం ఆమెని దూరం పెట్టారు. ఆ సమయంలో తారకరత్న ఆర్ధికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే తారకరత్న-అలేఖ్యలకు ముగ్గురు సంతానం కాగా, అందులో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. తారకరత్న మరణం తర్వాత అలేఖ్య చాలా కుంగిపోయింది. ఆమెని చేరదేసే వారే లేరు. తారకరత్న తండ్రి మోహన కృష్ణ కోడలిని, పిల్లలను చేరదీయలేదని తాజాగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అర్ధమవుతుంది.
తాజాగా అలేఖ్య తన ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. అందులో ఓ అభిమాని.. ఇప్పటికైనా తారకరత్న పేరెంట్స్ మిమ్మల్ని అంగీకరించారా? అని అడగగా, దానికి ఆమె స్పందిస్తూ.. ఆశ, నమ్మకాలే మనల్ని ముందుకు నడుపుతాయి. ఆ నమ్మకంతోనే ఇన్నేళ్లు ముందుకు సాగాము. తారకరత్న ఎప్పుడు ఆశ, నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. నేను కూడా ఎట్టి పరిస్థితులలో వాటిని వదిలిపెట్టను. ఖచ్చితంగా ఒకరోజు అది జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది. పిల్లలకు ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుంది… అని కామెంట్ చేసింది. అయితే అలేఖ్య సమాధానంతో తారకరత్న తల్లిదండ్రులు ఇప్పటికీ ఆమెని అంగీకరించలేదని అర్ధమవుతుంది.