Ram Charan-Mahesh|మాల్దీవ్స్‌లో మ‌స్త్ పార్టీ చేసుకున్న స్టార్ హీరోలు.. చిరు, నాగ్,మ‌హేష్‌, రామ్ చ‌ర‌ణ్ ఒకే ఫ్రేములో

Ram Charan-Mahesh|టాలీవుడ్ స్టార్ హీరోలు అందరు క‌లిసి ఒకే చోట క‌నిపించ‌డం చాలా అరుదు.స్టార్స్ అంద‌రి మ‌ధ్య మంచి స‌ఖ్య‌త ఉంటుంద‌ని అంద‌రికి తెలిసి. ఇలా వారు క‌లిసిక‌ట్టుగా క‌నిపిస్తే అభిమానుల ఆనంద‌మే వేరు.తాజాగా టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు ఒకేచోట కలిసి కనిపించారు. మన టా

  • By: sn    cinema    Nov 08, 2024 7:20 AM IST
Ram Charan-Mahesh|మాల్దీవ్స్‌లో మ‌స్త్ పార్టీ చేసుకున్న స్టార్ హీరోలు.. చిరు, నాగ్,మ‌హేష్‌, రామ్ చ‌ర‌ణ్ ఒకే ఫ్రేములో

Ram Charan-Mahesh|టాలీవుడ్ స్టార్ హీరోలు అందరు క‌లిసి ఒకే చోట క‌నిపించ‌డం చాలా అరుదు.స్టార్స్ అంద‌రి మ‌ధ్య మంచి స‌ఖ్య‌త ఉంటుంద‌ని అంద‌రికి తెలిసి. ఇలా వారు క‌లిసిక‌ట్టుగా క‌నిపిస్తే అభిమానుల ఆనంద‌మే వేరు.తాజాగా టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు ఒకేచోట కలిసి కనిపించారు. మన టాలీవుడ్ హీరోలు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, అఖిల్, మహేష్ బాబు, ఉపాసన, నమ్రత.. ఇలా పలువురు స్టార్స్ అంతా కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో వైరల్ గా మారింది. వీరంతా కలిసి ఇండస్ట్రీకి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఇచ్చిన ప్రైవేట్ పార్టీకి మాల్దీవ్స్ కి వెళ్లినట్టు తెలుస్తుంది.

మాల్దీవ్స్ లో వీరంతా కలిసి తినడానికి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న ఫోటో ఇప్పుడు బ‌య‌ట‌కు రాగా, ఈ పిక్ చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ పార్టీలో ఉండి ఉంటే బాగుంద‌ని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మన స్టార్స్ అంతా మాల్దీవ్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్.. స్టార్స్ అంతా ఒకేచోట కనపడటంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ ఈ పిక్‌ని మాత్రం తెగ వైర‌ల్ అయ్యేలా చేస్తున్నారు. ఈ స్టార్స్ అంతా కూడా సినిమాల‌కి కాస్త బ్రేక్ ఇచ్చి ఇలా మాల్దీవ్స్‌కి వెళ్లినట్టు తెలుస్తుంది.

ఇండ‌స్ట్రీలో నాగ్, చిరు మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇటీవ‌ల ఏఎన్ఆర్ ఈవెంట్‌కి చిరంజీవి హాజ‌రు కాగా, ఆయ‌న‌కి ఏఎన్ఆర్ అవార్డ్ కూడా అందించారు. ఆ స‌మ‌యంలో నాగ్‌పై చిరు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇక మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌లు కూడా చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. వారు క‌లిసి ప‌లు సంద‌ర్భాల‌లో పార్టీలు చేసుకోవ‌డం మ‌నం చూశాం. వీరంద‌రితో అఖిల్ కూడా ఉన్నాడు.ఏది ఏమైన ఇలా స్టార్స్ అంద‌రు ఒకే ఫ్రేములో క‌నిపించే స‌రికి ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.