Trivikram| భార్య పిల్ల‌ల‌తో తిరుమ‌ల వెళ్లిన త్రివిక్ర‌మ్.. ఆయ‌న‌కి ఇంత పెద్ద కొడుకులు ఉన్నారా…!

Trivikram| మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ర‌చ‌యిత‌గా కెరీర్ మొద‌లు పెట్టి ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నారు త్రివిక్ర‌మ్. చివ‌రిగా మ‌హేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేయ‌గా, ఈ మూవీ ఓ మోస్త‌రు విజ‌యాన్ని

  • By: sn    cinema    Jun 19, 2024 6:34 AM IST
Trivikram| భార్య పిల్ల‌ల‌తో తిరుమ‌ల వెళ్లిన త్రివిక్ర‌మ్.. ఆయ‌న‌కి ఇంత పెద్ద కొడుకులు ఉన్నారా…!

Trivikram| మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ర‌చ‌యిత‌గా కెరీర్ మొద‌లు పెట్టి ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నారు త్రివిక్ర‌మ్. చివ‌రిగా మ‌హేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేయ‌గా, ఈ మూవీ ఓ మోస్త‌రు విజ‌యాన్ని అందుకుంది. త్వ‌ర‌లో అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రీసెంట్‌గా త‌న ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్లారు.తన భార్య సౌజన్య, ఇద్దరు కొడుకులు రిషి, నీరజ్ లతో కలిసి త్రివిక్రమ్ శ్రీవారి మెట్టు నుండి తిరుమ‌ల‌కి నడిచి వెళ్లారు. ఆ తర్వాత కుటుంబంతో క‌లిసి వెంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నం చేసుకున్నారు.

ద‌ర్శ‌నం అనంత‌రం మీడియా త్రివిక్ర‌మ్‌తో మాట్లాడించే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆయ‌న ఏమి మాట్లాడ‌కుండానే వెళ్లిపోయారు. అయితే తొలిసారి త్రివిక్ర‌మ్ ఇద్ద‌రు పిల్ల‌లు బ‌య‌ట క‌న‌ప‌డ‌డంతో వారిద్ద‌రిని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. త్రివిక్ర‌మ్‌కి ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అంటూ ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సడెన్ గా ఇలా తిరుమల శ్రీవారిని కాలినడకన వచ్చి దర్శించుకోవడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మాములుగా ఆయన తన సినిమా రిలీజ్ సమయంలో కానీ, సినిమా సక్సెస్ అయిన స‌మ‌యంలో మాత్రమే త్రివిక్ర‌మ్ తిరుమ‌ల‌కి వెళ‌తాడు. కాని ఇప్పుడు ఎలాంటి అకేష‌న్ లేకుండా ఆయ‌న ఫ్యామిలీతో తిరుమ‌ల‌కి వెళ్ల‌డం హాట్ టాపిక్ అయింది.

అయితే త్రివిక్రమ్ కి మంచి సన్నిహితుడైన పవన్ కళ్యాణ్ ఇటీవ‌ల ఏపీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయిన నేపథ్యంలో త్రివిక్రమ్ తిరుమల శ్రీవారిని సందర్శించారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ప‌వ‌న్ -త్రివిక్ర‌మ్ స్నేహం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇద్ద‌రు మంచి స్నేహితులు. వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో ఎన్నో స‌క్సెస్ పుల్ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. అటుపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌వ‌న్ బ్యాకెండ్‌లో గురూజీ చాలా వ‌ర్క్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ రాసిచ్చేది త్రివిక్ర‌మ్ అనే టాక్ కూడా ఉంది.