Venu Swamy|భ‌ర్త‌ని వెన‌కేసుకొచ్చిన వేణు స్వామి భార్య‌.. నాగ చైత‌న్య‌ని గిఫ్ట్ కావాల‌ని అడుగుతుందిగా..!

Venu Swamy| నాగ చైత‌న్య‌- శోభిత‌ల ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత వారి గురించి ప‌లువురు ప‌లు ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంద‌రు ఆ జంట‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తుంటే మ‌రి కొంద‌రు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఎప్పటి మాదిరిగానే ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ వార్త‌ల‌లో నిలిచే వేణు స్వామి చైతూ- శోభితల ఎంగేజ్‌మెంట్ అయిన వెంట‌నే వారి జీవితం గురించి విశ్లేష‌ణ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు. దీనిపై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు అందింది. తె

  • By: sn    cinema    Aug 14, 2024 7:14 AM IST
Venu Swamy|భ‌ర్త‌ని వెన‌కేసుకొచ్చిన వేణు స్వామి భార్య‌.. నాగ చైత‌న్య‌ని గిఫ్ట్ కావాల‌ని అడుగుతుందిగా..!

Venu Swamy| నాగ చైత‌న్య‌- శోభిత‌ల ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత వారి గురించి ప‌లువురు ప‌లు ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంద‌రు ఆ జంట‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తుంటే మ‌రి కొంద‌రు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఎప్పటి మాదిరిగానే ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ వార్త‌ల‌లో నిలిచే వేణు స్వామి చైతూ- శోభితల ఎంగేజ్‌మెంట్ అయిన వెంట‌నే వారి జీవితం గురించి విశ్లేష‌ణ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు. దీనిపై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు అందింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ , తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ , సోషల్ మీడియా లో ఫిల్మ్ సెలబ్రిటీస్ పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఇలా మాట్లాడుతుండ‌డం మంచిది కాద‌ని వారు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

అయితే వేణు స్వామిపై ఇప్పుడు తీవ్ర‌మైన ట్రోలింగ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న భార్య సీన్‌లోకి వ‌చ్చింది. సెలబ్రిటీలు విడిపోతారా కలిసుంటారా అని జ్యోతిష్యం చెప్పే తన భర్త కన్నా.. సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూసే మీడియా ఛానల్స్‌ను ముందు ప్రశ్నించాలంటూ వేణు స్వామి భార్య‌ వీణా శ్రీవాణి అన్నారు. అంతేకాదు.. తన భర్త చేసినదాంట్లో ఎలాంటి తప్పు లేదంటూ చెబుతూ మీడియా ఛాన‌ల్స్‌పై మండిప‌డింది. ఓ సీనియ‌ర్ జర్న‌లిస్ట్‌గా నేను మాట్లాడుతున్నాను. ఒకప్పుడు ఎన్నో టెస్ట్‌లు పాస్‌ అయితేనే జర్నలిస్ట్ చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు ఒకటి రెండు వీడియో చేస్తే చాలు జర్నలిస్ట్‌లు అయిపోతున్నారు. లైవ్‌లో బీప్స్‌ లేకుండానే బూతులు వేస్తున్నారు. ఇవన్ని కూడా పేరున్న సో కాల్డ్‌ మీడియా చానళ్లే చేస్తున్నాయి అంటూ ఓ రేంజ్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

మ‌రోవైపు నాగ చైతన్యని ఓ గిఫ్ట్ కావాలని డిమాండ్ చేసింది వేణు స్వామి భార్య‌. నాగ చైతన్య, శోభిత మీకు కంగ్రాట్స్.. హ్యాపీగా ఉండండి.. మీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి.. సో కాల్డ్ యోధులు వేరే వాళ్లని టార్గెట్ చేసి.. మీ టాపిక్‌ను డీవీయేట్ చేయడం ఏంటి? తుంటిని కొడితే పళ్లు ఊడినట్టు అంటూఓ వీడియోని షేర్ చేశారు. . ఈ వీడియోలో ఆమె యాటిట్యూడ్, మాట్లాడే తీరుని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఏది ఏమైన ఇన్నాళ్లు వేణు స్వామి హాట్ టాపిక్‌గా మార‌గా, ఇప్పుడు వేణు స్వామి సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ అయింది.