Nabha Natesh | ‘స్వయంభు’తో హాట్‌ బ్యూటీ నభా నటేశ్‌ రాత మారేనా..?

Nabha Natesh | హీరోయి‌న్‌ నభా నటేశ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్‌ అందాలతో ఒక్కసారిగా తెలుగు తెరపైకి దూసుకొచ్చింది ఈ బ్యూటీ. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీలో అందాలను అరబోస్తూ.. మంచి గుర్తింపే పొందింది.

Nabha Natesh | ‘స్వయంభు’తో హాట్‌ బ్యూటీ నభా నటేశ్‌ రాత మారేనా..?

Nabha Natesh | హీరోయి‌న్‌ నభా నటేశ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్‌ అందాలతో ఒక్కసారిగా తెలుగు తెరపైకి దూసుకొచ్చింది ఈ బ్యూటీ. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీలో అందాలను అరబోస్తూ.. మంచి గుర్తింపే పొందింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. మూవీ సక్సెస్‌తో నభా నటేశ్‌ జోరు కొనసాగుతుందని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ, ఆ మూవీలు విజయవంతం కాలేకపోయాయి.

స్టార్‌ హీరోలతో పలు సినిమాలు చేసినా అవి గుర్తింపును తీసుకురాలేకపోయాయి. కథాకథనాల పరంగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. గ్లామర్ పరంగా మాత్రం తనవంతు న్యాయం చేస్తూనే వచ్చింది. అయితే, కొందరు హీరోయిన్లకు అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. అందుకే ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్‌ను మాత్రం అందుకోలేకపోతుంటారు. ఆ లిస్టులో నభా నటేశ్‌ సైతం ఉందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. 2015లో కన్నడ మూవీ ‘వజ్రకాయ’తో సినీరంగ ప్రవేశం చేసింది. తెలుగులో ‘నన్ను దోచుకుందువటే’.. సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కరోనా సమయంలో ఏదో ప్రమాదంలో గాయపడింది వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత కొద్దిరోజులు సినిమాలకు దూరమైంది. ఆ గాయాల కారణంగా ఏర్పడిన మచ్చలు తగ్గడం కోసమే ఆమె ఇంత గ్యాప్ తీసుకుందని ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నది. వరుస సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్నది. ఇటీవల నిఖిల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ‘స్వయంభు’లో హీరోయిన్‌గా ఎంపికైంది. సెట్స్‌లో సైతం జాయిన్ అయ్యింది నభా. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న సినిమా, ఇప్పటికే అందరిలో అంచనాలు పెంచింది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని నభా భావిస్తున్నది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి మరి.