27 నాటు బాంబులు.. నలుగురు అరెస్ట్
అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్ ,వారి వద్ద నుండి 27 నాటు బాంబులు స్వాధీనం డిఎస్పి సుధాకర్ రెడ్డి విధాత:చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాకాల మండలం వల్లివేడు పంచాయతీ ఎస్.టి కాలనీ సమీపంలో పాకాల సర్కిల్ సి.ఐ ఆశీర్వాదం, పాకాల ఎస్.ఐ వంశీధర్ తన సిబ్బందితో గ్రామ సంచారం చేస్తుండగా […]

అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్ ,వారి వద్ద నుండి 27 నాటు బాంబులు స్వాధీనం డిఎస్పి సుధాకర్ రెడ్డి
విధాత:చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాకాల మండలం వల్లివేడు పంచాయతీ ఎస్.టి కాలనీ సమీపంలో పాకాల సర్కిల్ సి.ఐ ఆశీర్వాదం, పాకాల ఎస్.ఐ వంశీధర్ తన సిబ్బందితో గ్రామ సంచారం చేస్తుండగా నెమలిగుట్టకు పోవు మట్టిరోడ్ లో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి అక్కడి నుండి పారిపోవుటకు ప్రయత్నించగా వారిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.
వారి వద్ద నుండి 27 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారిని విచారించగా ముగ్గురు వ్యక్తులు వల్లివేడు పంచాయతీ ఎస్.టి కాలనీ కి చెందిన నారగంటి రంజిత్(19) తండ్రి నారగంటి సుబ్రహ్మణ్యం, యానాది కృష్ణయ్య(50) తండ్రి లెట్ రామస్వామి, పి.బుజ్జి(29) తండ్రి పెద్దబ్బ లు చెందినవారు. ఇంకొకరు పులిచెర్ల మండలం విసి వడ్డీపల్లి కి చెందిన ములబాగల్ ఆనంద్(30) తండ్రి సుబ్బరాజు అను వారందరూ కూలి పనులు చేసుకుంటూ వ్యసనాలకు లోనై అక్రమంగా డబ్బు సంపాదించాలని, అడవి జంతువుల మాంసము లకు మంచి గిరాకీ ఉండటం వలన వేటాడలని నిర్ణయించుకున్నారు.
చిత్తూరుకి వెళ్లి కొన్ని తావు కోసం అని చెప్పి టపాసులు,ఔట్లు అంగళ్ళలో తీసుకొని వచ్చి, టపాసుల లో ఉండు నల్లమందు పౌడర్ ను తీసుకుని దానిలో గాజు పెంకులను,ఇనప ముక్కలను, గులకరాళ్లు ను అన్ని ఉంటలుగా పట్టుకుని వాటిని బాగా ఆరబెట్టి ఆరిన తరువాత వాటిని ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టి దానిపై నూలు దారంతో మొత్తం గట్టిగా చుట్టి నాటు బాంబులు తయారు చేశారు అని చెప్పారు.
నాటు బాంబుల ద్వారా అడవి జంతువులను వేటాడి వాటి మాంసమును అక్రమంగా అమ్మి డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిపారు.వారి వద్ద నుండి 27 నాటు బాంబులు స్వాధీనం చేసుకుని,నలుగురు ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం పాకాల కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఐ-2 రామకృష్ణ, ఐ.డి పార్టీ వేణు, భద్ర,సోమశేఖర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.