Crime news | అందంగా తయారు కావద్దని భార్యతో గొడవ.. ఆమె వినకపోవడంతో నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి..!
Crime news : సాధారణంగా మహిళలు అందంగా కనిపించడం కోసం తాపత్రయపడుతారు. అందరిలాగే ఆమెకు కూడా అందంగా తయారవ్వడం ఇష్టం. ఎప్పుడూ మోడ్రన్‌గా, స్టైల్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఆమె భర్తకు మాత్రం అలాంటివి ఇష్టం ఉండదు. కట్టుబొట్టూ సంప్రదాయ పద్ధతిలో చెబుతుంటాడు. కానీ ఆమెకు మాత్రం మోడ్రన్‌గా తయారవడమే ఇష్టం. భర్త మాట వినకుండా అలాగే తయారయ్యేది. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి.

Crime news : సాధారణంగా మహిళలు అందంగా కనిపించడం కోసం తాపత్రయపడుతారు. అందరిలాగే ఆమెకు కూడా అందంగా తయారవ్వడం ఇష్టం. ఎప్పుడూ మోడ్రన్‌గా, స్టైల్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఆమె భర్తకు మాత్రం అలాంటివి ఇష్టం ఉండదు. కట్టుబొట్టూ సంప్రదాయ పద్ధతిలో చెబుతుంటాడు. కానీ ఆమెకు మాత్రం మోడ్రన్‌గా తయారవడమే ఇష్టం. భర్త మాట వినకుండా అలాగే తయారయ్యేది. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి.
చివరికి భర్త మాటలు, వేధింపులతో విసిగిపోయిన ఆమె విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. దాంతో ఫ్యామిలీ కోర్టులో విచారణకు హాజరైన భర్త.. తాను మారిపోయానని, ఇక నుంచి నువ్వు మోడ్రన్‌గా తయారైనా అభ్యంతరం చెప్పనని భార్యను నమ్మించాడు. దాంతో ఆమె సంతోషించింది. భర్తతో కాపురానికి తిరిగొచ్చింది. ఈ క్రమంలో భర్త తన స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రామనగర జిల్లా మాగడికిలో ఉమేశ్ (36), దివ్య (32) దంపతులు నివసిస్తున్నారు. అందంగా కనబడటం కోసం దివ్య ఎప్పుడూ మోడ్రన్ దుస్తులు ధరిచేది. పెదాలకు లిప్‌స్టిక్ రాసుకునేది. ఒంటిపై టాటూ కూడా వేయించుకుంది. ఆమె చేసే పనులు ఉమేశ్‌కు నచ్చేవి కావు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అందంగా తయారవ్వొద్దని భర్త వేధించేవాడు. అనుమానంతో అసభ్యంగా మాట్లాడేవాడు. దాంతో దివ్య విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది.
ఈ క్రమంలో ఇటీవల భార్యాభర్తలు ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో విచారణకు హజరయ్యారు. విచారణ సందర్భంగా ఇకపై ఆమె అందంగా తయారైనా అభ్యంతరం చెప్పనని, ఆమెను అనుమానించనని, కలిసి కాపురం చేస్తామని ఉమేశ్ నమ్మించాడు. దాంతో తన భర్త మారాడు అనుకుని దివ్య సంతోషించింది. కలిసి కాపురం చేసేందుకు ఒప్పుకుంది. ఈ క్రమంలో కాపురానికి వచ్చిన దివ్య.. భర్తను నమ్మి అతడితో కలిసి కొండలు, గుట్టల్లో ఉండే ఊజగల్లు దేవాలయానికి వెళ్లింది.
కానీ ఉమేశ్ మాత్రం ఆమెకు నమ్మకద్రోహం చేసేందుకు పథకం రచించాడు. పథకం ప్రకారం తన నలుగురు స్నేహితులను ముందే అక్కడికి పంపించాడు. వారంతా ఉమేశ్, దివ్యల రాకకోసం వేచి ఉన్నారు. దైవ దర్శనం అనంతరం ఉమేశ్ ముందుగా పన్నిన పథకం ప్రకారం దివ్యను ఓ కొండ వద్దకు తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెను దారుణంగా హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు.
అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉమేశ్‌తోపాటు మరొకరి కోసం గాలింపు చేపట్టారు.