చిట్టీ డ‌బ్బు ఇవ్వ‌మ‌న్నందుకు త‌గ‌ల బెట్టేశారు

విధాత‌: వరంగల్ లో చిట్ ఫండ్స్ ఆగడాలు ఎక్కువవుతున్నాయి. చిట్టీ ఎత్తుకున్నా డబ్బులు ఇవ్వడానికి సంవత్సరాలు అవుతున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ఏజెంట్ల కుటుంబ సభ్యులతో దాడులు చేయిస్తున్నారు. హన్మకోండలోని అచలా చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు కట్టిన రాజు అనే వ్యక్తి తన చిట్టీ ఎత్తుకున్నా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో అచలా కంపెనీ వద్ద నిన్న ఆందోళనకు దిగాడు. అది మనసులోపెట్టుకున్న అచలా చిట్ ఫండ్ యాజమాన్యం చిట్టీ ఏజెంట్ భార్యతో అతని షాపు పైన అతనిపై […]

చిట్టీ డ‌బ్బు ఇవ్వ‌మ‌న్నందుకు త‌గ‌ల బెట్టేశారు

విధాత‌: వరంగల్ లో చిట్ ఫండ్స్ ఆగడాలు ఎక్కువవుతున్నాయి. చిట్టీ ఎత్తుకున్నా డబ్బులు ఇవ్వడానికి సంవత్సరాలు అవుతున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ఏజెంట్ల కుటుంబ సభ్యులతో దాడులు చేయిస్తున్నారు. హన్మకోండలోని అచలా చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు కట్టిన రాజు అనే వ్యక్తి తన చిట్టీ ఎత్తుకున్నా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో అచలా కంపెనీ వద్ద నిన్న ఆందోళనకు దిగాడు. అది మనసులోపెట్టుకున్న అచలా చిట్ ఫండ్ యాజమాన్యం చిట్టీ ఏజెంట్ భార్యతో అతని షాపు పైన అతనిపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి య‌త్నించింది. ఈ సంఘటనలో రాజు సెల్ ఫోన్ షాపు దగ్దమవగా రాజు పైన కూడా పెట్రోల్ పోసి అంటించడంతో తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు వెంటనే అతన్ని కాపాడే ప్రయత్నం చేయగా ఎదురుగా ఉన్న పాన్ షాపు యజమాని రంగయ్య కూడా గాయాలపాలయ్యాడు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు . ప్రస్తుతం రాజు చావుబతుకుల మద్య కోట్టుమిట్టాడుతున్నాడు.