Crime News | లివ్‌ఇన్ పార్ట్‌నర్ హత్య.. 2 రోజులు శవంతోనే..
రితిక ఆఫీసులో మరొకరితో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు సచిన్. అనుమానం కాస్తా పెనుభూతంగా మారడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో జూన్27న పెద్ద గొడవ జరగగా రితికను గొంతుపిసికి చంపేశాడు సచిన్.

Crime News | ఇటీవల కాలంలో భాగస్వాముల హత్యలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. చంపేడమే కాకుండా ఆ మృతదేహాలను మాయం చేయడానికి వింతగా ఆలోచిస్తున్నారు. అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది. ఓ వ్యక్తి తాను పెళ్లిచేసుకోవాలనుకున్న పార్ట్‌నర్‌ను అనుమానంతో చంపి భయంతో మృతదేహం వద్ద రెండు రోజుల పాటు నిద్రపోయాడు. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. సచిన్ రాజ్‌పుత్(32), రితికాసేన్(29) కలిసి సహజీవనం చేస్తూ భోపాల్‌లోని గాయత్రినగర్‌లో ఉంటున్నారు. సచిన్ ఖాళీగా ఉండగా.. రితికా సేన్ ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే, తనకు ఉద్యోగం లేదని.. రితిక ఆఫీసులో మరొకరితో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు సచిన్. అనుమానం కాస్తా పెనుభూతంగా మారడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో జూన్27న పెద్ద గొడవ జరగగా రితికను గొంతుపిసికి చంపేశాడు సచిన్. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో తర్వాత ఏం చేయాలో అర్థం కాక రితిక శవాన్ని ఒక దుప్పటిలో చుట్టి బెడ్ మీదనే ఉంచాడు. భయంతో రెండు రోజుల పాటు విపరీతంగా తాగుతూ మృతదేహం పక్కనే నిద్రించినట్లు పోలీసులు తెలిపారు.