విద్యుత్ తీగ‌లు త‌గ‌ల‌డంతో బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు.. 5 మంది స‌జీవ‌ద‌హనం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘాజిపూర్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సుకు విద్యుత్ వైర్లు త‌గిలాయి. దీంతో బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో 5 మంది ప్ర‌యాణికులు స‌జీవ‌ద‌హ‌నం

విద్యుత్ తీగ‌లు త‌గ‌ల‌డంతో బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు.. 5 మంది స‌జీవ‌ద‌హనం

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘాజిపూర్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సుకు విద్యుత్ వైర్లు త‌గిలాయి. దీంతో బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో 5 మంది ప్ర‌యాణికులు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. కొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 30 మందికిపైగా ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు స‌మాచారం.

స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. ప్ర‌మాదానికి గురైన ప్ర‌యివేటు బ‌స్సులో పెళ్లి బృందాన్ని తీసుకెళ్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. మవులో పెళ్లి వేడుక ముగించుకుని సొంతూరికి వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. కాలిన గాయాల‌తో బాధ‌ప‌డుతున్న వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో ప‌లువురి ప‌రిస్థితి విషమంగా ఉన్న‌ట్లు స‌మాచారం.