మంచం ఇవ్వని కుమార్తె.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్యాయత్నం
విధాత: ఓ మహిళ మాతృత్వాన్ని మరిచిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి పట్ల కర్కశంగా ప్రవర్తించింది. వృద్ధాప్య దశలో తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతురే దుర్మార్గానికి పాల్పడింది. మంచంపై అయితే కంటి నిండా నిద్ర పోవచ్చు.. అది కాస్త ఇవ్వు అని అడిగిన తల్లితో కూతురు రాక్షసంగా ప్రవర్తించింది. చివరకు కూతురి కళ్లెదుటే తల్లి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుంది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో శనివారం వెలుగు చూసింది. పాల్వంచ […]

విధాత: ఓ మహిళ మాతృత్వాన్ని మరిచిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి పట్ల కర్కశంగా ప్రవర్తించింది. వృద్ధాప్య దశలో తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతురే దుర్మార్గానికి పాల్పడింది. మంచంపై అయితే కంటి నిండా నిద్ర పోవచ్చు.. అది కాస్త ఇవ్వు అని అడిగిన తల్లితో కూతురు రాక్షసంగా ప్రవర్తించింది. చివరకు కూతురి కళ్లెదుటే తల్లి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుంది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో శనివారం వెలుగు చూసింది.
పాల్వంచ పట్టణం బ్రహ్మణ బజార్‌కు చెందిన ఎస్ సావిత్రి తన కూతురు లక్ష్మీతో కలిసి ఉంటోంది. అయితే బతుకు దెరువు కోసం సావిత్రి కిరాణం షాపు నడుపుకుంటూ కాలం గడుపుతోంది. అయితే గత కొద్ది రోజుల నుంచి తల్లీకూతుళ్ల మధ్య వివాదాలు మొదలయ్యాయి. అదేదో ఆస్తి పంపకాల కోసం వివాదాలు చోటు చేసుకోలేదు. కేవలం మంచం, వంట పాత్రల విషయంలోనే.
వయసు పైబడటంతో మంచం కావాలని తల్లి కోరగా, ఇచ్చేందుకు కూతురు నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సావిత్రి.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు ఎగిసిపడటాన్ని గమనించిన స్థానికులు.. మంటలను ఆర్పేశారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. సావిత్రి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.