నకిలీ చలానాల కేసు ప్రధాన నిందితుడైన రామ్ ధీరజ్ అరెస్ట్
విధాత: కృష్ణా జిల్లాలో నకిలీ చలానాల కేసు దర్యాప్తులో పురోగతి లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్టాంప్ వెండర్ రామ్ ధీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి కోటి రూపాయల నగదును ప్రభుత్వ ఖజానాలో జమ చేసినట్లు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిందితుల నుంచి నూరు శాతం నగదు రికవరీకి చర్యలు తీసుకుంటామన్నారు.