సీఎం కేసీఆర్ సభలో అపశృతి.. – డీజే శ‌బ్ధానికి గుండెపోటుతో రైతు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది.

సీఎం కేసీఆర్ సభలో అపశృతి.. – డీజే శ‌బ్ధానికి గుండెపోటుతో రైతు మృతి

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది. భువనగిరి నియోజకవర్గం భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన రైతు మెట్టు సత్తయ్య (55) డీజే శబ్ద తీవ్రతకు గుండెపోటుతో మృతి చెందాడు. బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి సత్తయ్య బహిరంగసభకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సభా ప్రాంగణం అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. అదే సమయంలో కళాకారుల ఆటపాటలు, డీజే శబ్ద తీవ్రతకు మెట్టు సత్తయ్య ఆకస్మికంగా కుప్పకూలి పడిపోయారు. పక్కనే ఉన్న వారు గమనించి బాధితున్ని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యంలోనే గుండె పోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.