తుపాకీ మిస్‌ఫైర్‌.. హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

విధాత‌(తిరుప‌తి): తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో తిరుపతి ప్రత్యేక జైలులో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. వెస్ట్‌ సీఐ శివప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ఏఆర్‌ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణరెడ్డి (47) ఏడాది నుంచి సబ్‌ జైలు వద్ద గార్డుగా పనిచేస్తున్నారు. లక్ష్మీనారాయణరెడ్డి ఎప్పటిలానే శనివారం సాయంత్రం 6.00 గంటలకు డ్యూటీ ముగించుకున్నాడు. ఇంటికి వెళ్లేందుకని దుస్తులు మార్చుకునే సమయంలో తుపాకీ (303 రైఫిల్‌) పక్కన పెడుతుండగా […]

తుపాకీ మిస్‌ఫైర్‌.. హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

విధాత‌(తిరుప‌తి): తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో తిరుపతి ప్రత్యేక జైలులో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. వెస్ట్‌ సీఐ శివప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ఏఆర్‌ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణరెడ్డి (47) ఏడాది నుంచి సబ్‌ జైలు వద్ద గార్డుగా పనిచేస్తున్నారు. లక్ష్మీనారాయణరెడ్డి ఎప్పటిలానే శనివారం సాయంత్రం 6.00 గంటలకు డ్యూటీ ముగించుకున్నాడు.

ఇంటికి వెళ్లేందుకని దుస్తులు మార్చుకునే సమయంలో తుపాకీ (303 రైఫిల్‌) పక్కన పెడుతుండగా మిస్‌ ఫైర్‌ అయ్యింది. బుల్లెట్‌ గుండెలోకి దూసుకు వెళ్లడంతో లక్ష్మీనారాయణరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు.