సింహం దాడిలో వ్య‌క్తి మృతి

విధాత‌: గుజ‌రాత్ రాష్ట్రం, జునాగ‌ఢ్‌ జిల్లాలో మామిడి తోటకు కాప‌లాగా ఉన్న వ్య‌క్తి పై సింహం దాడి చేసి చంపేసింది. జిల్లా గిర్ ఫారెస్ట్ డివిజన్‌లోని త‌లాలా రేంజ్‌లోగ‌ల మ‌ధుపూర్ గ్రామంలో శ‌నివారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బ‌హ‌దూర్‌భాయ్ జీవాభాయ్ (35) అనే వ్య‌క్తి ఎప్ప‌టిలాగే శుక్ర‌వారం రాత్రి కూడా గ్రామం స‌మీపంలోని ఓ మామిడి తోట కావలి ప‌డుకున్నాడు. అయితే, ఈ తెల్ల‌వారుజామున స‌మీప అట‌వీ ప్రాంతం నుంచి […]

సింహం దాడిలో వ్య‌క్తి మృతి

విధాత‌: గుజ‌రాత్ రాష్ట్రం, జునాగ‌ఢ్‌ జిల్లాలో మామిడి తోటకు కాప‌లాగా ఉన్న వ్య‌క్తి పై సింహం దాడి చేసి చంపేసింది. జిల్లా గిర్ ఫారెస్ట్ డివిజన్‌లోని త‌లాలా రేంజ్‌లోగ‌ల మ‌ధుపూర్ గ్రామంలో శ‌నివారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బ‌హ‌దూర్‌భాయ్ జీవాభాయ్ (35) అనే వ్య‌క్తి ఎప్ప‌టిలాగే శుక్ర‌వారం రాత్రి కూడా గ్రామం స‌మీపంలోని ఓ మామిడి తోట కావలి ప‌డుకున్నాడు.

అయితే, ఈ తెల్ల‌వారుజామున స‌మీప అట‌వీ ప్రాంతం నుంచి వ‌చ్చిన ఓ సింహం అత‌నిపై దాడి చేసింది. ముందుగా త‌న మంచానికి కొద్ది దూరంలో క‌ట్టేసిన మేక‌పై సింహం దాడి చేయ‌గా.. జీవ‌భాయ్ దాన్ని త‌రిమేసే ప్ర‌య‌త్నం చేశాడు. దాంతో ఆ సింహం జీవాభాయ్‌పై దూకి చంపేసింది. అరుపులు విని వెళ్లిన గ్రామ‌స్తులు సింహాన్ని గ‌మ‌నించి అటవీ అధికారులకు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే అట‌వీ సిబ్బంది అక్క‌డికి చేరుకుని ఆ సింహాన్ని బంధించారు.