అయ్యో అమ్మా..
విధాత(హైదరాబాద్): అమ్మా అనే పిలుపు కోసం ఎదురు చూసింది. ఆరేళ్ల తరువాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఆనందం రెండు రోజులు కూడా నిలువలేదు. కరోనా ఆ తల్లిని బలితీసుకుంది. నగరంలోని గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ కూతురు భవానీ(27)కి చింతల్‌బస్తీకి చెందిన కార్తీక్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. అన్నీ ఉన్నా ఆ దంపతులను పిల్లల్లేని లోటు వెంటాడేది. ఆలుమగల ప్రార్థనలు ఫలించాయి. ఏప్రిల్ 23న భవానీ పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. కానీ, ఈ ఆనందం రెండ్రోజులు […]

విధాత(హైదరాబాద్): అమ్మా అనే పిలుపు కోసం ఎదురు చూసింది. ఆరేళ్ల తరువాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఆనందం రెండు రోజులు కూడా నిలువలేదు. కరోనా ఆ తల్లిని బలితీసుకుంది. నగరంలోని గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ కూతురు భవానీ(27)కి చింతల్‌బస్తీకి చెందిన కార్తీక్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది.
అన్నీ ఉన్నా ఆ దంపతులను పిల్లల్లేని లోటు వెంటాడేది. ఆలుమగల ప్రార్థనలు ఫలించాయి. ఏప్రిల్ 23న భవానీ పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. కానీ, ఈ ఆనందం రెండ్రోజులు కూడా నిలువలేదు. ఆ మరుసటిరోజే ఆమెకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో తల్లీబిడ్డలను వేరుగా ఉంచారు. రెండ్రోజులు చికిత్స తరువాత ఇంటికి పంపారు.
ఇంట్లో ఆక్సిజన్ అందిస్తూనే వైద్యసేవలందించారు. అనంతరం రెండు రోజులకు ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి భవానీ కన్నుమూసింది. పిల్లల కోసం పరితపించిన కూతురు.. తల్లి అయిన మురిపెం తీరకుండానే మరణించడంతో ఇరు కుటుంబాలు దుఖఃసాగరంలో మునిగిపోయాయి.
దత్తాత్రేయ సంతాపం..: భవానీ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని దత్తన్న కరుణాకర్‌కు పంపించిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఇటీవల కరుణాకర్ ఇంటికి వచ్చిన సమయంలో భవానీతో జరిపిన సంభాషణ గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని ఆకాంక్షించారు.