కన్నతండ్రిని కాలితో తొక్కి చంపిన కసాయి కొడుకు
విధాత: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం సౌత్ పేరుపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రి పట్ల ఓ కొడుకు కసాయిగా మారాడు. తండ్రి ఉల్లంపర్తి(60) గొంతుపై కొడుకు లాజరస్ కాలితో తొక్కి చంపాడు.ఆస్తిని తన సోదరీలకు ఇచ్చేస్తాడనే అనుమానంతో నిందితుడు లాజరస్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.