గంజాయి సేవిస్తున్న విద్యార్థుల అరెస్టు

విధాత : గంజాయి సిగరెట్లు తాగుతున్న ఏడుగురు విద్యార్థులను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు విద్యార్థులు ఉంటున్న ఇంటిపై దాడి చేసి గంజాయి సేవిస్తున్న విద్యార్థులను అరెస్టు చేశారు.
ఎల్బీనగర్‌లో ఉంటున్న ఆ విద్యార్థులు కరీంనగర్, పెద్దపల్లి, గోదావరి ఖని ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారి వద్ధ నుంచి 3కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులు గంజాయి సేవిస్తూ, లేదా గంజాయితో పట్టుబడితే వారిపై పెట్టబడే కేసులతో వారి చదువులు, ఉద్యోగాలకు ఇబ్బంది ఉంటుందని, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.