Thief Note | మీ సొమ్మును నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తా.. ఓ దొంగ క్షమాపణ లేఖ వైరల్
Thief Note | దొంగల పని ఏంటి..? దొరికిన కాడికి దోచుకోని పారిపోవడం.. ఇక ఆ సొమ్ముతో జల్సాలు చేయడం. అయితే ఇందుకు విరుద్ధంగా ఓ దొంగ ఉన్నాడు. చాలా నిజాయితీపరుడు ఆ దొంగ. ఎందుకంటే.. ఓ ఇంట్లో ఉన్న సొమ్మును దోచుకోని ఓ లేఖ రాసి వెళ్లిపోయాడు. మీ సొమ్మును నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తా.. మా ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేదని లేఖలో పేర్కొన్నాడు.

Thief Note | దొంగల పని ఏంటి..? దొరికిన కాడికి దోచుకోని పారిపోవడం.. ఇక ఆ సొమ్ముతో జల్సాలు చేయడం. అయితే ఇందుకు విరుద్ధంగా ఓ దొంగ ఉన్నాడు. చాలా నిజాయితీపరుడు ఆ దొంగ. ఎందుకంటే.. ఓ ఇంట్లో ఉన్న సొమ్మును దోచుకోని ఓ లేఖ రాసి వెళ్లిపోయాడు. మీ సొమ్మును నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తా.. మా ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేదని లేఖలో పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాకు చెందిన చితిరాయ్ సెల్విన్(79) రిటైర్డ్ టీచర్. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. జూన్ 17వ తేదీన చెన్నైలో ఉన్న తన కుమారుడి ఇంటికి సెల్విన్ భార్యతో కలిసి వెళ్లాడు. ఇక పనిమనిషి అప్పుడప్పుడు వచ్చి ఇల్లును శుభ్రం చేసే వెళ్లేది.
అయితే మంగళవారం సాయంత్రం పనిమనిషి ఇంటికి చేరుకోగా, తలుపులు తెరుచుకోని ఉన్నాయి. దీంతో ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. సెల్విన్‌కు కూడా ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు వచ్చి పరిశీలించగా, రూ. 60 వేల నగదు, రెండు జతల చెవి కమ్మలు(బంగారం), వెండి కడియాలను దొంగ దొంగిలించినట్లు తేలింది.
ఆ ఇంట్లోనే గ్రీన్ ఇంక్‌తో రాసిన ఓ లేఖ పోలీసులకు లభ్యమైంది. ఓ బంగారం దుకాణానికి సంబంధించిన కవర్‌పై ఇలా రాసి ఉంచాడు దొంగ. నన్ను క్షమించండి. మీ సొమ్మును నెల రోజుల్లో మళ్లీ తిరిగి ఇచ్చేస్తా.. మా ఇంట్లో ఒకరు అనారోగ్యానికి గురయ్యారు అని రాసిపెట్టాడు. అంటే అనారోగ్యానికి గురైన వ్యక్తి వైద్య ఖర్చుల కోసమే అతను దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.