గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు మృతి

విధాత‌(అమరావతి): ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో మంగళవారం గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో ముగ్గురు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వింజమూరు మండలం చండ్రపడియాల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో చోటు చేసుకుంది. పరిశ్రమలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో దవాఖానకు తరలించగా.. బాధితుడు చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసులు అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి […]

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు మృతి

విధాత‌(అమరావతి): ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో మంగళవారం గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో ముగ్గురు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వింజమూరు మండలం చండ్రపడియాల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో చోటు చేసుకుంది.

పరిశ్రమలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో దవాఖానకు తరలించగా.. బాధితుడు చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసులు అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.