వ్యూహం చిత్రంపై హైకోర్టులో విచారణ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం చిత్రం రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగతూనే ఉంది. ఈ మూవీ గత సంవత్సరం డిసెంబర్ 29న రిలీజ్

– సెన్సార్ సర్టిఫికెట్‌తో పాటు పలు రికార్డులు కోర్టుకు అందజేసిన సెన్సార్ బోర్డ్
– రికార్డులను పరిశీలించిన ధర్మాసనం
– తదుపరి విచారణ నేటికి వాయిదా
విధాత, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం చిత్రం రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగతూనే ఉంది. ఈ మూవీ గత సంవత్సరం డిసెంబర్ 29న రిలీజ్ కావాల్సింది ఉంది. కానీ ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగల్ జడ్జి ధర్మాసనం జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ వ్యూహం చిత్రం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం ఈ చిత్రానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) బోర్డు ఏర్పాటు చేసిన రివైజింగ్ కమిటీ రికార్డులను పరిశీలించి.. ఉత్తర్వులు జారీ చేయాలని సింగిల్ జడ్జి ధర్మాసనాన్ని ద్విసభ్య ధర్మాసనం కోరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సోమవారం హైకోర్టు సీజే ధర్మాసనం వ్యూహం చిత్రంపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డ్ వ్యూహం చిత్రం సెన్సార్ సర్టిఫికెట్‌తోపాటు సంబంధిత పలు రికార్డులను న్యాయస్థానానికి అందజేసింది. సెన్సార్ బోర్డ్ ఎక్స్ పర్ట్ కమిటీ వివరాలు పరిశీలించిన ధర్మాసనం మరోసారి విచారణ చేపడుతామని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.