Ward Boy Performs Surgery | మహిళా పేషెంట్‌ను నగ్నంగా పడుకోబెట్టి సర్జరీ చేసిన వార్డ్‌బాయ్.. Video viral
Ward Boy Performs Surgery | సాధారణంగా నిపుణులైన వైద్యులు మాత్రమే సర్జరీలు చేస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మాత్రం వార్డు బాయ్ (Ward Boy) సర్జరీ చేశాడు. ఒక మహిళా రోగి (Female Patient) దుస్తులు విప్పించి మరీ సర్జరీ నిర్వహించాడు.

Ward Boy Performs Surgery : సాధారణంగా నిపుణులైన వైద్యులు మాత్రమే సర్జరీలు చేస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మాత్రం వార్డు బాయ్ (Ward Boy) సర్జరీ చేశాడు. ఒక మహిళా రోగి (Female Patient) దుస్తులు విప్పించి మరీ సర్జరీ నిర్వహించాడు. అంతేగాక సర్జరీ చేస్తూ వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనపై దర్యాప్తు చేయాలని యూపీ ఆరోగ్య శాఖ ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హార్దియాలోని బస్తీ కేర్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఐ సెంటర్‌లో చికిత్స కోసం చేరిన మహిళా రోగికి అక్కడి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. వివస్త్రగా ఉన్న ఆమె సర్జరీకి వార్డు బాయ్ కూడా సహకరించాడు. మహిళా రోగికి సర్జరీ చేస్తూ అతను వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే, ఆ ప్రైవేట్ ఆసుపత్రి డైరెక్టర్ సంజయ్ కుమార్ సూచనల మేరకే తాను మహిళా రోగికి సర్జరీ చేసినట్లు వార్డు బాయ్ చెప్పాడు. సంజయ్ కుమార్ మాత్రం వార్డు బాయ్ సర్జరీ చేసిన సంగతి తనకు తెలియదని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేసి వార్డు బాయ్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ కూడా ఈ ఘటనపై స్పందించింది. దోషులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
महिला को नग्न कर के उसकी ड्रेसिंग कर रहा था वॉर्ड बॉय, बस्ती के प्राइवेट अस्पताल का वीडियो वायरल हुआ तो मच गया बवाल।
जानिए जांच के बाद इस वायरल वीडियो को लेकर क्या जानकारी सामने आई है।#Basti #ViralVideo #UPNews pic.twitter.com/lntSi6zCHX
— UP Tak (@UPTakOfficial) August 15, 2024