Govindaraja Swamy Temple | తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుంచి 24 వరకు వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ నెల 15న అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు మొదలవనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
Govindaraja Swamy Temple | తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుంచి 24 వరకు వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ నెల 15న అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు మొదలవనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 16న ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనంపై నుంచి గోవిందరాజస్వామి భక్తులను కటాక్షించనున్నారు. 16న ఉదయం చిన్నశేష వాహనసేవ, రాత్రి హంస వాహనసేవ జరుగుతుంది. 18న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం విహరిస్తారు.
19న ఉదయం కల్పవృక్ష వాహన సేవ, రాత్రి సర్వభూపాల వాహనంపై కటాక్షిస్తారు. 20న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం భక్తులను అనుగ్రహించనున్నారు. 21న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనసేవ ఉంటుంది. 22న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం సేవలు జరుగుతాయి. 23న ఉదయం రథోత్సవం.. రాత్రి అశ్వవాహనంపై విహరిస్తారు. 24న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.