Chipuru Katta | సంపదను పెంచే చీపురును బయటి వ్యక్తులు చూడొచ్చా..?
Chipuru Katta | చీపురే( Chipuru ) కదా అని దాన్ని చీప్‌గా చూడొద్దు. చీప్‌గా ఉన్న వారిని కూడా గొప్పగా బతికేలా చేస్తుంది చీపురు. మరి దాని పవర్ అలాంటిది. నిత్యం ఇంటి శుభ్రత కోసం వినియోగించే చీపురు( Chipuru Katta ) విషయంలో వాస్తు నియమాలు( Vastu Tips ) పాటిస్తే.. ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొంది కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. మరి చీపురు విషయంలో పాటించాల్సిన వాస్తు విషయాలు ఏంటో తెలుసుకుందాం..

Chipuru Katta | చీపురు( Chipuru Katta )ను చాలా మంది లక్ష్మీదేవి( Lakshmi Devi ) స్వరూపినిగా భావిస్తారు. కాబట్టి చీపురును ఇంట్లో ఎక్కడంటే అక్కడ ఉంచకూడదు. చీపురును నిర్లక్ష్యం చేస్తే ఆ ఇంట్లో పేదరికం తాండవించే అవకాశం ఉంది. వాస్తు నిపుణుల( Vastu Experts ) అభిప్రాయం ప్రకారం.. చీపురును ఎల్లప్పుడూ ఇంటికి దక్షిణ దిశ( South )లోనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. సంపద పెరుగుతుంది. తద్వారా ఆర్థిక కష్టాలు తొలగిపోయి.. కోటీశ్వరులు అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు.. చీపురు బయటి వ్యక్తులకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి వ్యక్తులకు కనిపించేలా చీపురును ఉంచితే.. ఆ ఇంట అప్పులు ఎక్కువై.. ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరి చీపురును ఎప్పుడు కొనుగోలు చేయాలి..?
చీపురుని కొనుగోలు చేయడానికి అనువైన దినం.. బుధవారం లేదా గురువారం, శుక్రవారం. ఈ మూడు రోజుల్లోనే చీపురును కొనాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు పండుగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనూరాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో చీపురు కొనకూడదని చెబుతున్నారు.
చీపురును ఎప్పుడు బయట పడేయాలి..?
ఇక ఇంట్లో పాడైపోయిన చీపురును బయట పడేసేందుకు కూడా వాస్తు నియమాలు ఉన్నాయి. పాడైపోయిన చీపురును సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే బయట పడేయాలి. మంగళవారం, శుక్రవారం, శనివారాలలో చీపురును పడేయడం మంచిది కాదు. ఈ మూడు రోజుల్లో చీపురు బయటపడేస్తే ఆర్థిక కష్టాలను కొని తెచ్చుకున్నట్టే అని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.