మేషం
మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తివ్యాపారాల్లో అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే కాలం. ఆర్థికంగా లబ్ధి పొందుతారు.
వృషభం
వృషభరాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తివ్యాపారాలలో మీ నైపుణ్యాలతో అందరిని ఆకట్టుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక లాభాలు ఉంటాయి.
మిథునం
మిథునరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కొన్ని ఆందోళనకరమైన ఘటనలు ఎదురుకావచ్చు. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. ఆరోగ్యం సహకరించదు.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వ్యాపారస్థులకు ధనలాభం ఉండే అవకాశం ఉంది.
సింహం
సింహరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వాదప్రతివాదనలకు దూరంగా ఉండండి. పని ప్రదేశంలో కూడా ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంయమనం పాటించండి.
కన్య
కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఓర్పుగా సహనంగా ఉండడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి.
తుల
తులారాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. గ్రహబలం బాగున్నా కొన్ని సొంత తప్పిదాల వల్ల మీ పరపతి దెబ్బ తినవచ్చు. వాదనలకు దిగవద్దు. మాటలు జాగ్రత్తగా మాట్లాడితే మేలు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ఈరోజు శుభంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
ధనుస్సు
ధనస్సురాశి వారికి ఈరోజు సాధారణంగా గడుస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులకు గురవుతారు. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
మకరం
మకరరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఇంట్లో బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అనుకూలం. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.
కుంభం
కుంభరాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంది. చాకచక్యంగా మాట్లాడి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి.
మీనం
మీనరాశి వారికి ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. అన్ని రంగాల వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి.