సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన ఆందోళన ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఊహించని ధనలాభాలు అందుకుంటారు.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు, స్వస్థానప్రాప్తి వంటి శుభ యోగాలున్నాయి. బంధు మిత్రులతో అనుబంధం దృఢపడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో సహనంతో మెలగాల్సి ఉంటుంది. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. ప్రతికూల ఆలోచనలు వీడండి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టకాలం కొనసాగుతోంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా శ్రేష్టమైన సమయం. కీలక వ్యవహారాల్లో తోటివారి సహాయ సహకారాలు ఉపయోగ పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరమైన బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ధనధాన్య లాభాలున్నాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహబలం అంత అనుకూలంగా లేదు కాబట్టి వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగడంతో ఒత్తిడికి లోనవుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణ ఉంటుంది. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో సరదాగా, సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పరీక్ష సమయం. ఓర్పు సహనంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో మొండి పట్టుదలకు పోకుండా రాజీ ధోరణి అవలంబిస్తే మంచిది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. మొహమాటంతో సమస్యల్లో చిక్కుకుంటారు.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు చేటు తెస్తాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అవసరం. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో పురోగతి ఉంటుంది. చేసే పనుల్లో స్పష్టత పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తారు.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సమాచార లోపం లేకుండా జాగ్రత్త వహించండి. నిరంతర సాధనతో ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వం సాధిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి.