Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి జీవితంలో పెనుమార్పులు..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి జీవితంలో పెనుమార్పులు..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాలవారు ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో గౌరవం, ఖ్యాతి పెరుగుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. అవివాహితులు త్వరలోనే కళ్యాణ కాంతులను చూస్తారు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అద్బుతమైన రోజు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా నేడు చూడబోతున్నారు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు సర్దుబాటు ధోరణితో రాజీపడేందుకు ప్రయత్నిస్తే మంచిది. విలాసవంతమైన వాటిపై అధికంగా ఖర్చు చేస్తారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి చేపట్టిన పనుల్లో జాగ్రత్తగా ఉండండి. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. మితిమీరిన కోపంతో ఇతరులను బాధించేలా పరుషంగా మాట్లాడకండి.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. వ్యాపారంలో మీ భాగస్వాములతో మంచి డీల్ కుదుర్చుకుంటారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల నుంచి ఆర్ధిక ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని రంగాల వారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

తుల

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన సమావేశాలు, చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు. సమాజంలో పేరుప్రఖ్యాతులు పొందుతారు. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మొండి పట్టుదల కోపాన్ని విడిచిపెడితే మంచిది. గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ రోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఓ వ్యవహారంలో ధననష్టం జరగవచ్చు.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోకుండా ఉంటే మంచిది. కీలక విషయాలలో సమయానుసారంగా నడుచుకోవడం వలన సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉండవచ్చు.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మీ జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మైలురాయిని అందుకుంటారు. వృత్తిపరమైన స్థాయి పెరగడం వల్ల సమాజంలో హోదా పెరుగుతుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందాలంటే తీవ్రమైన కృషి అవసరం. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, ప్రియమైనవారితో వాగ్వివాదాలకు అవకాశం ఉంది. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి.