Deepavali Puja | ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా..? దీపావళి వేళ లక్ష్మీదేవితో పాటు ఈ దేవుడిని కూడా పూజించండి..!
ఆర్థిక ఇబ్బందులతో( Financial Problems ) సతమతమయ్యే వారు లక్ష్మీదేవితో పాటు కుబేరుడికి( Kuberudu ) కూడా పూజలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట. భవిష్యత్‌లో ఊహించని విధంగా ధనలాభం( Money Profit )జరిగే అవకాశం ఉందట.

Deepavali Puja | దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ( Deepavali Festival ) సందడి మొదలైంది. ఈ నెల 31వ తేదీన దీపావళి పండుగను ఘనంగా నిర్వహించేందుకు గృహిణులు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక లక్ష్మీదేవి పూజ( Lakshmi Devi Puja )కు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో( Financial Problems ) సతమతమయ్యే వారు లక్ష్మీదేవితో పాటు కుబేరుడికి( Kuberudu ) కూడా పూజలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట. భవిష్యత్‌లో ఊహించని విధంగా ధనలాభం( Money Profit )జరిగే అవకాశం ఉందట.
ధన త్రయోదశి ,నరక చతుర్దశి, దీపావళి… ఈ మూడు పండుగలలో లక్ష్మీ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపావళి రోజు సాయంత్రం సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి నాడు లక్ష్మీ దేవిని పూజించడం వలన జీవితంలో డబ్బుకు లోటు ఉండదని విశ్వాసం. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవితో కుబేరుడిని పూజించడం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుబేరుడిని పూజించడం వల్ల డబ్బుకు లోటుండదు..!
వాస్తవానికి కొన్ని ప్రాంతాల్లో ధనత్రయోదశి రోజున లక్ష్మీ దేవి, కుబేరు దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే దీపావళి లేదా ఇతర రోజులలో కూడా లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజించడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. హిందూ మతంలో యక్ష రాజైన కుబేరుడు సంపదకు దేవుడుగా భావిస్తారు. దీపావళి రోజున లక్ష్మీ దేవిని, కుబేర దేవుడిని పూజించడం వలన డబ్బు కొరత తొలగిపోతుంది. కోరుకున్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి.
దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం కలుగుతుందని, ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. లక్ష్మీమాత సమేతంగా కుబేర దేవుడిని పూజించే ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు ఉండదని ఎంతో లాభం ఉంటుందని చెబుతారు. హిందూ మతంలో కుబేరుడి ఆరాధన చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అంతేకాదు శుక్రవారం రోజున లక్ష్మీ దేవితో పాటు కుబేరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.