Vastu Tips | ఆ దుస్తుల‌తో ఇంటిని శుభ్రం చేస్తున్నారా..? అయితే ఆర్థిక క‌ష్టాలు వెంటాడిన‌ట్టే..!

Vastu Tips | చాలా మంది మ‌హిళ‌లు ఇంటిని ప్ర‌తి రోజు నీటితో శుభ్రం చేస్తుంటారు. అవ‌స‌ర‌మైతే ఉద‌యం, సాయంత్రం వేళ ఇంటిని తుడుస్తుంటారు. ఇంటిని శుభ్రం చేసేందుకు చాలా మంది మోప్‌ల‌ను ఉప‌యోగిస్తుంటారు. కొంద‌రైతే ఇంట్లో ఉన్న పాత బ‌ట్ట‌ల‌తో ఇంటిని క్లీన్ చేస్తుంటారు. అయితే వాస్తు ప్ర‌కారం ఇంటిని శుభ్రం చేయ‌డానికి పాత బ‌ట్ట‌ల‌ను ఉప‌యోగించ‌రాద‌ని వాస్తు పండితులు చెబుతున్నారు.

Vastu Tips | ఆ దుస్తుల‌తో ఇంటిని శుభ్రం చేస్తున్నారా..? అయితే ఆర్థిక క‌ష్టాలు వెంటాడిన‌ట్టే..!

Vastu Tips | చాలా మంది మ‌హిళ‌లు ఇంటిని ప్ర‌తి రోజు నీటితో శుభ్రం చేస్తుంటారు. అవ‌స‌ర‌మైతే ఉద‌యం, సాయంత్రం వేళ ఇంటిని తుడుస్తుంటారు. ఇంటిని శుభ్రం చేసేందుకు చాలా మంది మోప్‌ల‌ను ఉప‌యోగిస్తుంటారు. కొంద‌రైతే ఇంట్లో ఉన్న పాత బ‌ట్ట‌ల‌తో ఇంటిని క్లీన్ చేస్తుంటారు. అయితే వాస్తు ప్ర‌కారం ఇంటిని శుభ్రం చేయ‌డానికి పాత బ‌ట్ట‌ల‌ను ఉప‌యోగించ‌రాద‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. పాత దుస్తుల‌తో ఇంటిని శుభ్రం చేయ‌డం వ‌ల్ల ఆ ఇంటిపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఏయే దుస్తుల‌తో ఇంటిని శుభ్రం చేయ‌కూడ‌దో తెలుసుకుందాం..

పిల్ల‌ల దుస్తులు

పిల్ల‌ల‌కు సంబంధించిన పాత బ‌ట్ట‌ల‌తో గృహిణులు త‌మ ఇంటిని క్లీన్ చేస్తుంటారు. ఫ‌ర్మీచ‌ర్ దుమ్ము దుల‌ప‌డానికి ఈ బ‌ట్ట‌ల‌నే వినియోగిస్తుంటారు. కానీ ఇలా చిన్న పిల్ల‌ల బ‌ట్ట‌ల‌తో ఇంటిని క్లీన్ చేసుకోవ‌డం మంచిది కాద‌ని వాస్తు పండితులు హెచ్చ‌రిస్తున్నారు. ఎందుకంటే.. చిన్న పిల్లల బట్టలను శుభ్రం చేయడానికి వాడటం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక క‌ష్టాలు వెంటాడుతాయ‌ని చెబుతున్నారు.

లో దుస్తులు

అలాగే పాత లో దుస్తులను కూడా ఇంట్లో ఫ్లోర్‌ తుడవడానికి ఉపయోగించకూడదని వాస్తు నిపుణులు పేర్కొన్నారు. దీనివల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ తగ్గుతుందని చెబుతున్నారు.

చనిపోయిన వారి బ‌ట్ట‌లు

ఇంట్లో ఒక వ్య‌క్తి చ‌నిపోయారంటే వారి బ‌ట్ట‌ల‌ను చాలా మంది పారేస్తుంటారు. కొంద‌రైతే జ్ఞాప‌కంగా ఉంచుకుంటారు. ఇంకొంద‌రైతే వారి బ‌ట్ట‌ల‌తో ఇల్లు తుడ‌వ‌డం కోసం ఉప‌యోగిస్తుంటారు. అయితే చనిపోయిన వారి దుస్తుల‌తో ఇల్లు క్లీన్ చేయొద్ద‌ని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఇంటిపై ప్రతికూల ప్రభావం పడడంతో పాటు ఆర్థిక క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

సింథటిక్ దుస్తులు

కొందరు సింథటిక్‌ దుస్తులను ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. కానీ, ఇలాంటి వస్త్రాలతో ఇంటిని శుభ్రం చేయడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే.. వీటితో ఫ్లోర్‌ను శుభ్రం చేయడం వల్ల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.