Fish Aquarium | ఇంట్లో ఫిష్ అక్వేరియంతో ఆర్థిక ప్ర‌యోజ‌నాలెన్నో..! కానీ క‌చ్చితంగా 9 చేప‌లు ఉండాల్సిందే..!!

Fish Aquarium | చేప‌లు.. చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. చేప‌ల‌( Fish )ను ఇష్ట‌ప‌డే వారిలో చాలా మంది త‌మ నివాసాల్లో ఫిష్ అక్వేరియం( Fish Aquarium )ను ఏర్పాటు చేసుకుంటారు. ఈ మ‌ధ్య కాలంలో ఇండ్ల‌లో ఫిష్ అక్వేరియం ఏర్పాటు చేసుకోవ‌డం ట్రెండ్‌గా మారింది. అయితే ఫిష్ అక్వేరియంను వాస్తు శాస్త్రం( Vastu Tips ) ప్ర‌కారం ఏర్పాటు చేసుకుంటే మంచిద‌ని, ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఏర్పాటు చేస్తే ఆ ఇంట్లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని వాస్తు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Fish Aquarium | ఇంట్లో ఫిష్ అక్వేరియంతో ఆర్థిక ప్ర‌యోజ‌నాలెన్నో..! కానీ క‌చ్చితంగా 9 చేప‌లు ఉండాల్సిందే..!!

Fish Aquarium | చేప‌లు.. చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. చేప‌ల‌( Fish )ను ఇష్ట‌ప‌డే వారిలో చాలా మంది త‌మ నివాసాల్లో ఫిష్ అక్వేరియం( Fish Aquarium )ను ఏర్పాటు చేసుకుంటారు. ఈ మ‌ధ్య కాలంలో ఇండ్ల‌లో ఫిష్ అక్వేరియం ఏర్పాటు చేసుకోవ‌డం ట్రెండ్‌గా మారింది. అయితే ఫిష్ అక్వేరియంను వాస్తు శాస్త్రం( Vastu Tips ) ప్ర‌కారం ఏర్పాటు చేసుకుంటే మంచిద‌ని, ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఏర్పాటు చేస్తే ఆ ఇంట్లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని వాస్తు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కాబ‌ట్టి వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ఫిష్ అక్వేరియం ఏర్పాటు చేసుకుంటే.. ఎన్నో ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఫిష్ అక్వేరియం ఎక్క‌డ పెట్టాలి.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏంటో తెలుసుకుందాం..

ఈశాన్యం లేదా ఆగ్నేయం ఉత్త‌మ ప్రాంతం..

ఇంట్లో ఫిష్ అక్వేరియం ఏర్పాటుకు ఈశాన్యం లేదా ఆగ్నేయ దిశ ఉత్త‌మ ప్రాంత‌మ‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు దిశ‌లు శాంతి, ఆనందం, శ్రేయ‌స్సును సూచిస్తాయి. ఈశాన్యం సంప‌ద‌తో సంబంధం క‌లిగి ఉంటుంది. ఆర్థిక స్థిర‌త్వాన్ని కూడా తీసుకొస్తుంది ఈశాన్య మూల‌.

క‌చ్చితంగా 9 చేప‌లు ఉండాల్సిందే..

ఇంట్లో ఏర్పాటు చేసుకునే ఫిష్ అక్వేరియంలో చేప‌ల సంఖ్య కూడా ముఖ్య‌మే. వాస్తు ప్ర‌కారం క‌చ్చితంగా 9 చేప‌లు ఉండాల్సిందే. ఇందులో 8 చేప‌లు వేర్వేరు రంగుల్లో ఉండాలి. ఇవి ఒకేజాతికి చెందినవై ఉండాలి. డ్రాగన్ షిఫ్ తప్పనిసరిగా 8వ చేప అయి ఉంటే బాగుంటుంది. చేపల.. ఈ ప్రత్యేక కలయిక శ్రేయస్సును పెంచుతుంది. గోల్డ్ షిఫ్ ఉంటే ఇంకా శుభప్రదంగా చెప్పుకోవచ్చు.

చేప‌ల మ‌ర‌ణం చెడు శ‌క్తిని వ‌దించుకోవాల‌ని సూచిస్తుంది..

అక్వేరియంలో చేపల మరణం చెడు శక్తిని వదిలించుకోవడాన్ని సూచిస్తుంది. ఒక చేప చనిపోతే భయపడటానికి ఎలాంటి కారణం లేదు. చనిపోయిన చేప స్థానంలో మరో చేపను చేర్చుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఫిష్ అక్వేరియం ఆనందాన్ని మాత్రమే కాదు ఇంటి సభ్యులకు వచ్చే అన్ని విపత్తులను ఎదుర్కుంటుంది. చేపల అక్వేరియం ఉత్పాదకతను పెంచడమే కాదు.. విద్యను ప్రోత్సహిస్తుంది. అక్వేరియంలో కదిలే చేపలు ఇంట్లోని ప్రతికూల శక్తి నుంచి బయటపడేలా చేస్తాయి.