Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ధన ప్రవాహం..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. తమ రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన, వార ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలు ఎదురవుతాయి. ముఖ్యంగా వ్యాపారులు తమ పరిధిని విస్తరించి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారు విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో అపార్ధాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. వ్యక్తిగత అవసరాల కోసం అధిక ధనవ్యయం చేస్తారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కీలకమైన చర్చలలో పురోగతి ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ సరైన ప్రణాళికతో ముందుకెళ్తే ఆటంకాలు తొలగిపోతాయి. పెట్టుబడులు సేకరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్లలో పెట్టుబడులు అలోచించి పెట్టాలి. ఆదాయవృద్ధి కోసం ప్రయత్నించే వారికి ఈ వారం కలిసి వస్తుంది. నూతన ఆదాయ వనరులు పొందుతారు. వృత్తి పరమైన ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు కొత్త అవకాశాలు అందుకుంటారు. కెరీర్ పరంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారులు ఆశించిన ఫలితాలు పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన సమయం. వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కుటుంబంలో సామరస్యత నెలకొంటుంది. ప్రేమికులు గతంలోని సమస్యలు పరిష్కరించుకొని ముందుకెళ్తారు. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన అనుకూలత ఉంటుంది. ఉద్యోగులకు స్థానచలనం, పదోన్నతులు ఉండవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ లాభాలు ఆశించిన మేరకు ఉంటాయి. వ్యక్తిగతంగా ఈ వారం అంత అనుకూలంగా లేదు. ప్రేమ సంబంధాలు బెడిసి కొడతాయి. వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ముఖ్యంగా డబ్బు అప్పుగా తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య మంచి అవగాహన ఉంటుంది. పాత బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడులు కూడా మంచి రాబడిని ఇస్తాయి. ఆర్థికంగా, పరిస్థితులు మెరుగుపడతాయి. పొదుపు ప్రణాళికలపై దృష్టి సారిస్తే మంచిది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడపడంతో అనుబంధం దృఢ పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆనందం నెలకొంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు రాకుండా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగులు ఉన్నతాధికారులతో వినయంగా నడుచుకుంటే మంచిది. వ్యాపారులు కొంత నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది. శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారంలో పోటీ కారణంగా ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు ఆచి తూచి నడుచుకోవాలి. ప్రేమ వ్యహారాల్లో కలహాలు, అపార్ధాలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడండి. ఆర్థికంగా ఈ వారం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. సరైన ప్రణాళికతో అనవసర ఖర్చులు నివారించవచ్చు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మేలు. గిట్టని వారు వృత్తి వ్యాపారాలలో అవాంతరాలు సృష్టించే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితాలు లేక నిరాశతో ఉంటారు. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. కోర్టు సంబంధిత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మేలు. ప్రయాణాలు అనుకూలించవు. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. ఖర్చులు పెరగడం ఇబ్బంది కలగవచ్చు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా చికాకుతో ఉంటారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. జీతం పెరుగుదల, ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయము చేసుకుంటూ ముందుకెళ్లండి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అపార్ధాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అందరి సలహా తీసుకోండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి శుభసమయం.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ వారం కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. పని పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు. పనికట్టుకుని ఆటంకాలు సృష్టించే వారుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం కోల్పోవద్దు. వ్యాపారంలో ఆదాయం కన్నా రుణాలు, ఖర్చులు పెరుగుతాయి. వ్యక్తిగతంగా చూస్తే ఈ వారం అంత అనుకూలం కాదు. జీవిత భాగస్వామితో అనవసర కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో సామరస్యత లేకపోవడం ఇబ్బందులకు గురి చేస్టసుంది. కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులు తీవ్రమైన కృషితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. పై అధికారుల నుంచి సంపూర్ణ మద్దతుని పొందుతారు. ఉద్యోగంలో బదిలీ, పదోన్నతి ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు మీ స్థాయిని పెంచుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు కృషితో విజయాలను సాధిస్తారు. వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని సవాళ్లు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. బుద్ధి బలంతో తీసుకునే కీలకమైన నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. గతంలో రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. స్థిరాస్తి రంగం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు గొప్ప లాభాలను పొందుతారు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి తీరికలేని పనుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం కారణంగా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వారిపట్ల జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు వారం ద్వితీయార్ధం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. లాభాల శాతం పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి సరిపడా ఖర్చులు కూడా ఉంటాయి.