Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జీవిత భాగస్వామితో మధుర క్షణాలే..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. తమ రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన, వార ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగులు, ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు, ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా ఈ వారం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. బంధువులతో సంబంధాలు బలోపేతం అవుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరగకుండా జాగ్రత్త పడండి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కెరీర్ పరంగా ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. లలిత కళలు, సృజనాత్మక రంగాల వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా ఎదగడానికి మీరు చేసే ప్రయత్నాలు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను ఇవ్వవచ్చు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఒక కీలక వ్యవహారంలో ఆశించిన ఫలితాలు రావడం ఆలస్యం కావచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అప్రమత్తంగా ఉండడం అవసరం. ఉద్యోగులు ఆశించిన పదోన్నతులు పొందుతారు. స్థానచలనం సూచన కూడా ఉంది. ఇతరుల మాటలకు ప్రభావం చెందకుండా జాగ్రత్త పడండి. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. తెలివిగా ఖర్చు పెట్టండి. ఆర్థిక క్రమశిక్షణ అవసరం. కుటుంబంలో చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకోవచ్చు.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరంగా, పురోగతికి మంచి అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో పనిఒత్తిడి, అధికశ్రమ ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీతో మెలగాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు మనస్పర్థలకు దారితీస్తాయి. ఆర్థికంగా, ఈ వారం అస్థిరంగా ఉండవచ్చు. రావలసిన బకాయిలు చేతికి అందక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులకు, ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసించేవారికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెట్టవచ్చు.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. లక్ష్యసాధన కోసం కృషి చేసి సత్ఫలితాలు అందుకుంటారు. వ్యాపారులకు ఈ వారం ఆశాజనకంగా ఉంది. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పరంగా, ఈ వారం మునుపటి కంటే మెరుగ్గా ఉంటారు. ఖర్చులు పెరగవచ్చు కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సరైన ప్రణాళిక లేకపోతే నష్టాలు సంభవించవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రేమ విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్వయంకృషితో పనిచేస్తే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెట్టాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ప్రేమ వ్యవహారాల్లో ఆనందం ఉంటుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎదగడానికి చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, కోరుకున్న స్థానానికి బదిలీ పొందే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులు పట్టుదలతో పనిచేస్తే స్థిరమైన ప్రగతిని సాధించవచ్చు. వ్యాపారులు కీలక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆశించిన మేరకు లాభాలు అందుకుంటారు. ఆర్థిక నిర్వహణ విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు అడ్డంకులను అధిగమించి విజయానికి చేరువవుతారు. వారం ఆరంభంలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. జీవిత భాగస్వామితో మధుర క్షణాలను గడుపుతారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు మెరుగైన పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టేముందు ఆచి తూచి వ్యవహరించండి. ఖర్చుల విషయంలో తెలివిగా ప్రణాళిక చేసుకోండి. ఆర్థికంగా అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారాల్లో అవగాహనతో మెలిగితే మంచిది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు సహనంతో ఉంటే మంచిది. ప్రేమ వ్యవహారాలు కలిసిరావు. కుటుంబ కలహాలు చికాకు పెడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడండి. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు విజయం సాధించడానికి శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా మంచి ఫలితాలు రాబట్టాలంటే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి పరంగా స్థిరమైన పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు దృఢ సంకల్పంతో పని చేసి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో చిన్న చిన్న సవాళ్లు ఉన్నా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం అవసరం. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢపడుతుది. విద్యార్థులు పట్టుదలతో విజయాలు సాధిస్తారు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలలో సవాళ్లను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారాన్ని పొందుతారు. వారం మధ్యలో ఒత్తిడి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ విషయాల్లో సహనంతో మెలగాలి. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళతారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.