Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. త‌మ‌ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన, వార‌ ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు కెరీర్​పై శ్రద్ధ పెట్టాల్సిన సమయం. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు శుభవార్తలు వింటారు. వ్యాపారులు వ్యూహాత్మకంగా నడుచుకుంటే మంచి లాభాలను పొందగలరు. ఆస్తులు, భూములు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే పోటీల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వైవాహిక జీవితంలో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక ఒత్తిడి పెద్దగా ఉండదు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆదాయ వనరులు పెరగడంతో ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి అధికంగా ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం లేకుండా చూసుకోండి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు చికాకు పెడతాయి. ఉద్యోగులు కష్టించి పనిచేస్తే ప్రమోషన్‌కు అర్హత పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త పరిచయాల ద్వారా వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం ద్వారా గృహ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాల్లో నిజాయితితో లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంటుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కొన్ని సంఘటనల కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉండొచ్చు. వృత్తి పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో పనిభారం ఉన్నప్పటి సహచరుల సహకారంతో ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. రుణభారం, ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా చూస్తే కొన్ని పాత రోగాలు తిరగబెట్టవచ్చు.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు రావడం కష్టతరమవుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో, సామరస్యంగా మెలగాల్సి ఉంటుంది. వ్యాపారులకు స్టాక్ మార్కెట్‌లో మంచి లాభాలు కనిపించవచ్చు కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపార నిర్వహణలో పాత ప్రణాళికలను నిర్లక్ష్యం చేస్తే నష్టాలు సంభవించవచ్చు. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తి చేయడానికి సహోద్యోగుల సహకారం అవసరం. విద్యార్థులకు గట్టి కృషితో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు రావచ్చు.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో నిర్లక్ష్యం తగదు. ముఖ్యంగా ఉద్యోగులు నూతన బాధ్యతలపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించే అవకాశాలున్నాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపితే మంచిది. పెరిగే ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించాలి. లేదంటే భవిష్యత్తులో ఆర్ధిక సమస్యలు ఏర్పడవచ్చు. బంధువుల ఇంట శుభకార్యాలలో పాల్గొంటారు.

తుల (Libra)

తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. వ్యాపారంలో అధిక లాభాలు కోసం రచించే ప్రణాళికలు, అనుసరించే వ్యూహాలు సత్ఫలితాన్నిస్తాయి. ఆస్తుల కొనుగోలు కోసం రుణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. విజయం సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలి. లక్ష్య సాధనపై దృష్టి మరలకుండా జాగ్రత్త వహించాలి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కారణంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడిని సమర్థంగా అధిగమించడం ముఖ్యం, అనవసరమైన ఆందోళనకు లోనవ్వకండి. అందరు ఉన్నా ఒంటరితనం భావనతో ఉంటారు. ఆర్థికంగా ఊహించిన దానికన్నా ఖర్చులు పెరిగే అవకాశముంది. విహారయాత్రలు, సామాజిక కార్యక్రమాల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారులు కలిసివస్తాయి. ఉద్యోగులకు స్థానచలనానికి పూర్తి అవకాశముంది. కాబట్టి మార్పులకు సిద్ధంగా ఉండాలి. ఆరోగ్యం సహకరిస్తుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. కొత్త వ్యాపార అవకాశాలు ఎదురవుతాయి. ఈ వారం ఉద్యోగులకు కూడా అనుకూల సమయం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి అవకాశం రావచ్చు. చేపట్టిన పనిలో ఇతరుల సహాయం, సలహాలు తీసుకోండి. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. కుటుంబ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, సమస్యల పరిష్కారానికి ప్రయత్నించండి. ప్రేమలో అపార్థాలు తలెత్తవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకోవచ్చు. వ్యాపారంలో సుస్థిరమైన ప్రగతి సాధిస్తారు. ఊహించని విధంగా లాభాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగులు తమ పురోగతితో పూర్తి సంతృప్తి చెందుతారు. పదోన్నతికి అవకాశముంది. పని పట్ల శ్రద్ధ పెంచాలి. ఆర్ధిక పరిస్థితి మెరుగు పడడంతో ఆందోళన తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు కలవరపెడతాయి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు నష్టం కల్గిస్తాయి. వ్యాపారులు తొందరపడి పెద్ద పెట్టుబడులు పెడితే ఆర్థిక సమస్యలు ఏర్పడవచ్చు. ఉద్యోగులు పదోన్నతులు అందుకునే అవకాశముంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సమస్యలున్నా అనుకూలంగానే ఉంటాయి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మెరుగైన అవకాశాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాల కారణంగా వ్యయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఖర్చులు సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో సవాళ్లు ఉండవచ్చు. చర్చించడం ద్వారా సంబంధాన్ని మెరుగుపరచవచ్చు. యోగా, ధ్యానం చేయడం మంచిది.