తునిషా శర్మ ఆత్మహత్యపై కంగనా రౌనత్ ఫైర్‌

విధాత‌: బాలీవుడ్‌లోనే కాదు ఇండియా మొత్తం మీద ఇప్పుడు కంగనా రౌనత్ అంటే ఫైర్ బ్రాండ్ అనే పదానికి అసలు సిసలు ఉదాహరణ. తెలుగులో ఆమె ఎప్పుడో ప్రభాస్‌తో కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఏక్ నిరంజన్ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ప్ర‌భాస్‌తో కూడా గొడ‌వ‌ ప‌డింద‌ని, ఎంతో మంచి వాడైన యంగ్ రెబల్‌ స్టార్‌ని కూడా ఈమె త‌న ఈగోతో హ‌ర్ట్ చేసింద‌ని నాడు వార్త‌లు వ‌చ్చాయి. కానీ బాహుబ‌లి […]

తునిషా శర్మ ఆత్మహత్యపై కంగనా రౌనత్ ఫైర్‌

విధాత‌: బాలీవుడ్‌లోనే కాదు ఇండియా మొత్తం మీద ఇప్పుడు కంగనా రౌనత్ అంటే ఫైర్ బ్రాండ్ అనే పదానికి అసలు సిసలు ఉదాహరణ. తెలుగులో ఆమె ఎప్పుడో ప్రభాస్‌తో కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఏక్ నిరంజన్ అనే చిత్రంలో నటించింది.

ఈ చిత్రం షూటింగ్ సమయంలో ప్ర‌భాస్‌తో కూడా గొడ‌వ‌ ప‌డింద‌ని, ఎంతో మంచి వాడైన యంగ్ రెబల్‌ స్టార్‌ని కూడా ఈమె త‌న ఈగోతో హ‌ర్ట్ చేసింద‌ని నాడు వార్త‌లు వ‌చ్చాయి. కానీ బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ కావ‌డంతో ఇటీవ‌ల ఆమె అవకాశం వ‌స్తే ప్ర‌భాస్‌తో మ‌రోసారి క‌లిసి న‌టించాల‌ని ఉంద‌నే కోరిక‌ను బ‌య‌ట‌పెట్టింది.

ఆ త‌రువాత కాస్టింగ్ కౌచ్ విష‌యంలో, సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత సినిమాల‌లోని కొంద‌రి ఆధిప‌త్యం, వార‌స‌త్వంపై కూడా ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది. ఇక ఇటీవ‌ల ఆమె బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ కొన్ని సినిమాలపై నటీనటులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లోనే ఉంటుంది. అలాంటి ఆమె ఇప్పుడు తాజాగా ఆత్మహత్య చేసుకున్న తునీషా శ‌ర్మ విషయంపై మాట్లాడింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కంగ‌నా.. సినిమాల నుంచి రాజ‌కీయాల వ‌ర‌కు ప్ర‌తి విష‌యంలోనూ స్పందిస్తూ అడిగినా అడ‌గ‌క‌పోయినా త‌న అభిప్రాయాల‌ను నిత్యం తెలుపుతూనే ఉంటుంది. ఏ విషయం గురించి అయినా బెరుకు, భ‌యం లేకుండా మాట్లాడుతుంది.

ఏ రంగానికి సంబంధించిన విషయాల గురించి అయినా తన లైన్లో స్పందిస్తూ వార్తలో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఇందులో ఆమె ఒక స్త్రీ అన్నింటినీ తట్టుకోగలదు. ప్రేమలో విఫలమైన వివాహ బంధంలో ఆటుపోట్లు ఎదురైనా కూడా ఎదుర్కోగలదు.

కానీ ఒక మహిళకు నిజమైన ప్రేమ ఎప్పుడూ లభించదు. వారిని శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారు. అవి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇవి మాన‌సికంగా వారిపై తీవ్ర ఒత్తిడి కలుగజేస్తాయి. మన ఆడపిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. స్త్రీలకు భద్రత ఉండాలి.

ఈ సృష్టికి మూలం ఆడ‌దే. ఆడ‌ వారికి భ‌ద్ర‌త లేక‌పోతే ఈ సృష్టికి కూడా భద్రత ఉండ‌దు. మహిళలపై దాడులు చేసే వారిని నిర్దాక్ష‌ణ్యంగా చంపి వారిని కఠినంగా శిక్షించాలి. అలాంటి వారికి ఎలాంటి విచక్షణ లేకుండా మరణశిక్ష విధించాలి అని పేర్కొంది.

ఇంకా.. ఇతర మోసాలను, నేరాలను ఎలా డీల్ చేస్తారో అలాగే ఎమోషనల్ బ్లాక్ మెయిల్, భావోద్వేక వేధింపుల‌పై కూడా అదేవిధంగా ప్రవర్తించాలి.. రూమ‌ర్సే కదా అని చిన్నగా కొట్టిపారేయ‌వ‌ద్దు. అవన్నీ మనిషికి ఎంతో నష్టాన్ని కలుగజేస్తాయి. కొంతమందికి పక్క వారి ఎమోషన్స్ హాస్యాస్పదంగా కనిపిస్తాయి. కానీ అవి సెన్సిటివ్ మైండ్ ఉండే వారిపై అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి అని చెప్పుకొచ్చింది.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె చేతిలో ప‌లు సినిమాలు ఉన్నాయి. ఆమె చంద్రముఖి 2 సినిమాలో రాజ‌న‌ర్త‌కి పాత్ర‌ను పోషిస్తుంది. దీంతోపాటు నాటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఎమర్జెన్సీ నాటి పరిణామాల ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ అనే బయోపిక్‌లో నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర ఇందిరా గాంధీగా కనిపించనుంది.

ఈ సినిమాకు ఆమె దర్శకురాలిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. అలాగే వినోదిని దాస్‌ బయోపిక్‌తో పాటు తేజ‌స్‌ తేజ సినిమాలో నటిస్తోంది. అన్నట్లు ఆ మధ్య తెలుగు ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్‌లో మణికర్ణిక అనే సినిమాలో న‌టించింది.

ఈ షూటింగ్ సమయంలో క్రిష్‌తో సైతం గొడ‌వ పెట్టుకుంది. దాంతో ఈ సినిమా నుంచి క్రిష్ వైదొలిగాడు. మిగిలిన చిత్రం షూటింగ్‌ను ఆమె స్వీయ దర్శకత్వంలో పూర్తి చేసిన సంగతి కూడా తెలిసింది. అయితే సినిమా ప్ర‌మోష‌న్లో గానీ, టైటిల్స్‌లో గానీ క్రిష్‌కి క‌నీస క్రెడిట్ ఇవ్వ‌లేదు.

ఇలా అయినదానికి కానిదానికి నిత్యం గొడవలు పడుతూ ఈమె తనదైన యాటిట్యూడ్ చూపిస్తూనే ఉంది. ఈమె చెప్పే వాటిలో కొన్ని మంచి విషయాలు ఉంటే.. ఈమె ప్రవర్తనలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయని, పక్కవారిని అనవసరంగా బాధిస్తుందనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.